మరణించినా కులం వదలరా?

ABN , First Publish Date - 2021-10-24T08:18:23+05:30 IST

‘చనిపోయాక కూడా మనిషిని కులం వదలడం లేదు. కులాల వారీగా శ్మశానాలున్నాయా? అగ్ర కులస్థుల అంత్యక్రియలు జరిపిన శ్మశానంలో ఇతర కులాల వారిని అనుమతించరా? అందువల్ల రోడ్డు పక్కనే శవాలను.

మరణించినా కులం వదలరా?

అంత్యక్రియలను అడ్డుకుంటే కఠిన చర్యలు: మద్రాస్‌ హైకోర్టు

చెన్నై, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘చనిపోయాక కూడా మనిషిని కులం వదలడం లేదు. కులాల వారీగా శ్మశానాలున్నాయా? అగ్ర కులస్థుల అంత్యక్రియలు జరిపిన శ్మశానంలో ఇతర కులాల వారిని అనుమతించరా? అందువల్ల రోడ్డు పక్కనే శవాలను దహనం చేసేస్తారా? ఇదెక్కడి దౌర్భాగ్యం?’’ అంటూ మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కేటాయించిన శ్మశానంలో అన్ని కులాల వారి అంత్యక్రియలకు అనుమతించాల్సిందేనని, ఇందుకు భిన్నంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తన పొలానికి వెళ్లే దారిలో రోడ్డుపక్కనే శవాలను దహనం చేస్తున్నారంటూ కోయంబత్తూరు జిల్లా ఎరిపడి గ్రామానికి చెందిన అమృతవల్లి అనే మహిళ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్‌  విచారణ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు. శ్మశానవాటికలో అంత్య క్రియలను అడ్డుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - 2021-10-24T08:18:23+05:30 IST