విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ట్రాన్స్‌జెండర్ల పిటిషన్... విచారణను ముగించిన Madras High Court...

ABN , First Publish Date - 2022-07-02T00:27:49+05:30 IST

ట్రాన్స్‌జెండర్లకు (Transgendersకు) విద్య, ప్రభుత్వోద్యోగాల్లో

విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ట్రాన్స్‌జెండర్ల పిటిషన్... విచారణను ముగించిన Madras High Court...

చెన్నై : ట్రాన్స్‌జెండర్లకు (Transgendersకు) విద్య, ప్రభుత్వోద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌ను మద్రాస్ హైకోర్టు (Madras High Court) డిస్పోజ్ చేసింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్ల కోసం అత్యుత్తమ విధానం అమలవుతోందని తమిళనాడు ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ, జస్టిస్ ఎన్ మాల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది. 


ఇండియన్ ట్రాన్స్‌జెండర్ ఇనీషియేటివ్ ప్రతినిధి పి సుధ ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మాట్లాడుతూ, 2015 ఏప్రిల్ 6న ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం, విద్య, ప్రభుత్వోద్యోగాల్లో అత్యంత వెనుకబడిన తరగతి (ఎంబీసీ)గా ట్రాన్స్‌జెండర్లను గుర్తిస్తున్నట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ట్రాన్స్‌జెండర్లకు ఎంబీసీ కేటగిరీలోనే ధ్రువపత్రాలను జారీ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. 


Updated Date - 2022-07-02T00:27:49+05:30 IST