మదినిండా.. తిరంగా..

ABN , First Publish Date - 2022-08-14T05:54:42+05:30 IST

జిల్లా వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

మదినిండా.. తిరంగా..

- జిల్లా వ్యాప్తంగా ఫ్రీడం ర్యాలీలు

- ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌/కరీంనగర్‌ స్పోర్ట్స్‌/కరీంనగర్‌ క్రైం ఆగస్టు 13: జిల్లా వ్యాప్తంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పలు చోట్ల జాతీయ పతాకాలను చేతబూని ఫ్రీడం ర్యాలీలు నిర్వహించారు. కరీంనగర్‌ అంబేద్కర్‌ స్టేడియం నుంచి టవర్‌ సర్కిల్‌ వరకు విద్యార్థులు, అధికారులు, ఉద్యోగులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, స్కౌట్‌,గైడ్స్‌తో కలిసి ఫ్రీడం ర్యాలీని మేయర్‌ వై సునీల్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్‌, జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌, సీపీ సత్యనారాయణ, డీవైఎస్‌వో రాజవీరు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణిహరిశంకర్‌, టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, ప్రధానకార్యదర్శి దారం శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ జిల్లా  ప్రధానకార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

- జిల్లా జైలులో పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ మూడు రంగుల బెలూన్లను గాలిలోకి వదిలారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ సమ్మయ్య, జిల్లా సబ్‌ జైళ్ళ అధికారి శ్రీనివాస్‌, జైలు వైద్యాధికారి రమేష్‌, జైలర్‌ బి రమేష్‌ పాల్గొన్నారు. 

- ఆజాదీ-కా-అమృత్‌ మహోత్సవంలో భాగంగా శనివారం  కరీంనగర్‌లో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీపీ సత్యనారాయణ ప్రారంభించారు.  కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, సీఐలు తిరుమల్‌, నాగార్జునరావు, ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌, ఆటో సంఘం నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

- ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్‌ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్శెట్టి సంపత్‌, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి బండారి గాయత్రి, జిల్లా ఉపాధ్యక్షుడు జశ్వంత్‌, గుండారపు సంపత్‌, కార్యవర్గసభ్యులు దేవరకొండ అజయ్‌, పట్టణ వెస్ట్‌జోన్‌ అధ్యక్షుడు నరహరి లక్ష్మారెడ్డి, నార్త్‌జోన్‌ అధ్యక్షుడు పాదం శివరాజ్‌ పాల్గొన్నారు. 

- తిమ్మాపూర్‌: వజ్రోత్సవాల సందర్భంగా ఎల్‌ఎండీ గేట్లను త్రివర్ణ పతాకం రంగుల్లో లైట్లతో ఇరిగేషన్‌ అధికారులు అలంకరించారు. ఎల్‌ఎండీ నుంచి ఆరు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ గేట్ల ద్వారా మూడు రంగుల వెలుతుర్ల నుంచి నీరు దిగువకు వస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. 

Updated Date - 2022-08-14T05:54:42+05:30 IST