లాక్‌డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం.. 15 వరకు అన్నీ మూసివేత

ABN , First Publish Date - 2021-05-06T23:57:37+05:30 IST

దేశంలో కరోనా వైరస్ రెండో దశలో చెలరేగిపోతున్న వేళ మరో రాష్ట్రం లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రాణాంకత కరోనా

లాక్‌డౌన్ ప్రకటించిన మరో రాష్ట్రం.. 15 వరకు అన్నీ మూసివేత

భోపాల్: దేశంలో కరోనా వైరస్ రెండో దశలో చెలరేగిపోతున్న వేళ మరో రాష్ట్రం లాక్‌డౌన్ ప్రకటించింది. ప్రాణాంతక కరోనా మహమ్మారి చైన్‌ను తెగ్గొట్టేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలోకి మధ్యప్రదేశ్ కూడా చేరింది. ఈ నెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు 15 రోజులపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు తెలిపారు. అప్పటి వరకు ‘జనతా కర్ఫ్యూ’ కఠినంగా అమలవుతుందని వివరించారు. 18 శాతం పాజిటివిటీ రేటుతో రాష్ట్రాన్ని ఇలా వదిలేయలేమని, అందుకనే లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు శివరాజ్ పేర్కొన్నారు.  

Updated Date - 2021-05-06T23:57:37+05:30 IST