మాధవ్‌ ఓ రేపిస్ట్‌..

ABN , First Publish Date - 2022-08-13T05:30:00+05:30 IST

సిగ్గులేకుండా.. దుస్తుల్లేకుండా.. నిస్సిగ్గుగా న్యూడ్‌ వీడియోలతో హల్‌చల్‌ చేసిన గోరంట్ల మాధవ్‌ ఓ రేపిస్ట్‌ అంటూ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాధవ్‌ ఓ రేపిస్ట్‌..
విలేకరులతో మాట్లాడుతున్న టీడీపీ బీసీసెల్‌ నాయకులు

- ఎంపీ పదవికి రాజీనామా చేయాలి

- ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి

- బీసీ సెల్‌ నాయకుల ఆగ్రహం

హిందూపురం, ఆగస్టు 13: సిగ్గులేకుండా.. దుస్తుల్లేకుండా.. నిస్సిగ్గుగా న్యూడ్‌ వీడియోలతో హల్‌చల్‌ చేసిన గోరంట్ల మాధవ్‌ ఓ రేపిస్ట్‌ అంటూ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏమాత్రం సిగ్గుంటే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి హిందూపురం పార్లమెంట్‌ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో టీడీపీ కన్వీనర్‌ అశ్వత్థనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బీసీసెల్‌ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేవనహళ్లి ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ గోరంట్ల మాధవ్‌ ఏం ఒరగబెట్టాడని భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రశ్నించారు. మాధవ్‌ గత చరిత్ర కూడా రేపిస్ట్‌ స్వభావమేనని మండిపడ్డారు. సమాజం తలదించుకునేలా నూడ్‌ వీడియోలతో హల్‌చల్‌ చేసిన మాధవ్‌ వెంటనే రాజీనామా చేయాలన్నారు. నియోజకవర్గానికి ఎన్ని అభివృద్ధి పనులు తెచ్చారో ప్రజలకు చెప్పాలన్నారు చంద్రబాబు లోకే్‌షలపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఏబీఎన-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ గురించి మాట్లాడే అర్హత మాధవ్‌కు ఏమాత్రం లేదన్నారు.  చేసిన నిర్వాకాన్ని కప్పి పుచ్చుకునేందుకు మీడియాపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. మాజీ జడ్పీటీసీ ఆదినారాయణ మాట్లాడుతూ ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి బీసీ వర్గాలకు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకే్‌షను విమర్శించే స్థాయి మాధవ్‌కు లేదన్నారు. మాజీ సర్పంచులు రాము, మంజునాథ్‌లు మాట్లాడుతూ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియోతో తెలుగుజాతి పరువుపోయిందన్నారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారుకూడా సిగ్గుపడేలా చేశారన్నారు. ఆయనకు వత్తాసుపలుకుతున్న అధికార పార్టీ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని హితవుపలికారు. హిందూపురంలో గోరంట్ల మాధవ్‌ బట్టలు ఊడదీసి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామకృష్ణారెడ్డి, చిక్కీరప్ప, హనుమంతు, వీరాంజి, రవీంద్రనాయుడు, ప్రసాద్‌, ప్రకాశ, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-08-13T05:30:00+05:30 IST