నార్సింగ్ ప్రేమోన్మాది దాడి ఘటనపై డీసీపీ స్పందన

ABN , First Publish Date - 2021-03-03T19:08:53+05:30 IST

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమ్మాయిపై ప్రమోన్మాది దాడి ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పందించారు.

నార్సింగ్ ప్రేమోన్మాది దాడి ఘటనపై డీసీపీ స్పందన

హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమ్మాయిపై ప్రమోన్మాది దాడి ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు స్పందించారు. బుధవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిపై కత్తితో ప్రేమోన్మాది దాడి చేశాడని... గత రెండున్నర ఏళ్లుగా షారుక్ సల్మానికి, బాధితురాలికు మధ్య పరిచయం ఉందని తెలిపారు. సెలూన్ షాప్‌లో షారుక్ సల్మాని పని చేస్తున్నాడని, అక్కడే బాధితురాలికి పరిచయం అయినట్లు చెప్పారు. గతంలో కూడా బాధితురాలు ఇంటికి షారుక్ సల్మాని వెళ్ళేవాడన్నారు. అయితే  నిందితుడు షారుక్ సల్మానికి పెళ్లి అయిందని, ఒక పిల్లవాడు ఉన్నారని బాధితురాలికి తెలియడంతో...కొద్ది రోజులు నుండి షారుక్ సల్మానిని దూరం పెట్టినట్లు తెలిపారు. తనను దూరం చేస్తుందని కోపంతో నిన్న బాధితురాలి ఇంటికి వెళ్ళాడని... మాటా మాటా పెరిగి కూరగాయలు కత్తితో నిందితుడు దాడి చేసినట్లు చెప్పాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని... ఈరోజు  రిమాండ్ చేస్తున్నామన్నారు. నిందితుడిపై ఐపీసీ 452, 307 కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 

Updated Date - 2021-03-03T19:08:53+05:30 IST