మలేరియా, డెంగ్యూ వ్యాధులను నివారించాలి

ABN , First Publish Date - 2022-07-07T03:00:46+05:30 IST

మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి కీటకజనిత వ్యాధులను నివారించాలని జిల్లా మలేరియా అధాకారిణి డాక్టర్‌ ఐ

మలేరియా, డెంగ్యూ వ్యాధులను నివారించాలి
ర్యాలీలో పాల్గొన్న జిల్లా మలేరియా అధాకారిణి హుసేనమ్మ, తదితరులు

కావలిటౌన్‌, జూలై6: మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా లాంటి కీటకజనిత వ్యాధులను నివారించాలని జిల్లా మలేరియా అధాకారిణి డాక్టర్‌  ఐ హుసేనమ్మ పేర్కొన్నారు.  బుధవారం పట్టణంలోని బొమ్మారెడ్డివీధిలో మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా, మెదడువాపు వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కళాజాతా బృందం ద్వారా ప్రజల్లో అవగాహన నిర్వహించారు. అనంతరం డాక్టర్‌ హుసేనమ్మ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో దోమలు పుట్టకుండా, కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  ఎక్కడైనా జ్వరాలు వస్తే వెంటనే వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.  కార్యక్రమంలో డివిజన్‌ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శివకుమార్‌, ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి పీ రవి, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T03:00:46+05:30 IST