న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు మళ్లీ కరోనా సోకింది. హైదరాబాద్‌లో నేడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. వెంకయ్యను ఇటీవల కలిసినవారు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.