నిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్‌!

ABN , First Publish Date - 2022-05-18T06:54:59+05:30 IST

ప్రముఖ న్యాయవాది, జిల్లావాసి నిరంజన్‌రెడ్డి లక్కీఛాన్స్‌ కొట్టేశారు.

నిరంజన్‌రెడ్డికి లక్కీఛాన్స్‌!
నిరంజన్‌రెడ్డి

ఏపీ నుంచి రాజ్యసభకు జిల్లావాసి!

 నిర్మల్‌, మే 17 ( ఆంధ్రజ్యోతి ) : ప్రముఖ న్యాయవాది, జిల్లావాసి నిరంజన్‌రెడ్డి లక్కీఛాన్స్‌ కొట్టేశారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే ఏకంగా రాజ్యసభకు ఎంపిక కానున్నారు. తెలంగాణ కు చెందిన సీనియర్‌ న్యాయవాది అయిన నిరంజన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు వైసీపీ అభ్యర్థి గా తెరపైకి రావడం.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి... న్యా యవాద వృత్తిలో అపార అనుభవం గడించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు లతో పాటు సుప్రీంకోర్టులోనూ సీనియర్‌ న్యాయవాదిగా నిరంజన్‌రెడ్డి పేరొందారు. గతంలో ఎలాంటి రాజకీయ పదవులు చేపట్టకుండానే నేరుగా పార్ల మెంటు ఎగువసభకు ఎంపీగా వెళ్తుండటం గమనార్హం. జిల్లాలోని దిలావర్‌ పూర్‌ మండలం సిర్గాపూర్‌ గ్రామానికి చెందిన సీనియర్‌ న్యాయవాది దివంగత ఎస్‌.విద్యాసాగర్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు నిరంజన్‌రెడ్డి. బాల్యం సిర్గాపూర్‌, నిర్మల్‌లో గడిచింది. ప్రాథమిక విద్య కొన్నాళ్ల పాటు నిర్మల్‌లో సాగిన తర్వాత హైదరాబాద్‌లో హైస్కూల్‌విద్య అభ్యసించారు. అనంతరం పూణేలో ఉన్న ప్రతిష్టాత్మక లా కళాశాల సింబయాసిస్‌లో చేరారు. న్యాయవాద విద్య అనంతరం 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. సీనియర్‌ న్యాయవాదులు మనోహర్‌రెడ్డి, కే. ప్రతాప్‌ రెడ్డి దగ్గర ప్రాక్టీస్‌ చేశారు. 1994-95 మధ్యకాలంలో జస్టిస్‌ మురళీధర్‌ వద్ద సుప్రీంకోర్టులోనూ అనుభవం గడించారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా వంటి అనేక కీలకకేసుల్లో ఆయన వాదించి జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజ శేఖర్‌రెడ్డి కాలం నుంచి నిరంజన్‌రెడ్డి రాజకీయాల్లోకి వస్తారని ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాలో ప్రచారం ఉంది. 2008సంవత్సరంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి ఉపఎన్నికలు వచ్చాయి. అప్పుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా ఫోన్‌ చేసి నిరంజన్‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయాలని ఆహ్వానించినప్పటికీ.. ఆయన రాజకీ యాలకు దూరంగా ఉన్నారు. న్యాయవాద ప్రాక్టీస్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. వివిధ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కొని సీబీఐ కేసులతో జైలుకు వెళ్లిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌రెడ్డికి నిరంజన్‌రెడ్డి వ్యక్తిగత న్యాయవాదిగా నిరంజన్‌రెడ్డి గుర్తింపు పొందారు. 

Updated Date - 2022-05-18T06:54:59+05:30 IST