టెట్‌ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత

ABN , First Publish Date - 2022-07-02T05:21:09+05:30 IST

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాల్లో మెదక్‌ జిల్లా 25వ స్థానంలో నిలిచింది.

టెట్‌ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత

 మెదక్‌ జిల్లాలో పేపర్‌-1లో 33.66శాతం ,  పేపర్‌-2లో 48.25 శాతం 

  సంగారెడ్డి జిల్లాలో పేపర్‌ 1లో 30.88శాతం ,

  పేపర్‌ 2లో పేపర్‌  44.85 శాతం ఉత్తీర్ణత


మెదక్‌ అర్బన్‌/సంగారెడ్డి అర్బన్‌, జూలై 1: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాల్లో మెదక్‌ జిల్లా 25వ స్థానంలో నిలిచింది. రెండు పేపర్లలోనూ నిరాశాజనకమైన ఫలితాలు రావడం గమనార్హం. గత నెల 12న మెదక్‌ జిల్లాలో నిర్వహించిన టెట్‌ పరీక్షకు పేపర్‌-1 కేటగిరి నుంచి 7,756 మంది హాజరు కాగా 2,611 మంది మాత్రమే క్వాలిఫై అయ్యి 33.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-2 కేటగిరీలో 5,463 మంది పరీక్ష రాయగా.. 2,636 మంది పాసై 48.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించి పేపర్‌-1 పరీక్షను 15531 మంది పరీక్ష రాయగా, అందులో 4,796 మంది అర్హత సాధించారు.పేపర్‌-2 పరీక్షను 11340 మంది పరీక్ష రాయగా అందులో 5,086 మంది అర్హత సాధించారు. పేపర్‌-1 లో 30.88 శాతం మంది, పేపర్‌-2 లో 44.85 శాతం మంది అర్హత సాధించారని డీఈవో నాంపల్లి రాజేశ్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-02T05:21:09+05:30 IST