Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీకు Cricket అంటే ఇష్టమా.. ఇదిగో ఇక్కడ తక్కువ ధరలకే బ్యాట్‌లు.. ఇక ఆలస్యమెందుకు..!

  • లోకల్‌.. క్రికెట్‌ కిట్లు
  • తయారు చేసి విక్రయిస్తున్న గుజరాత్‌ వాసులు
  • బ్రాండెడ్‌వి కొనలేని వారికి అందుబాటు ధరలో..

హైదరాబాద్ సిటీ/ఎర్రగడ్డ : క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ అంతా.. ఇంత కాదు. క్రికెట్‌లోని అతిరథ మహారథుల వలే తయారు కావాలని క్రికెట్‌ ప్రియులు తాపత్రయ పడుతుంటారు. వారు సాధన చేయాలంటే క్రికెట్‌ కిట్లు కొనుగోలు చేయాలి. షోరూంలో బ్రాండెడ్‌ కిట్లు కొనుగోలు చేయాలంటే రూ. 15-20 వేలు ఖర్చవుతుంది. ఎర్రగడ్డలో ఆయుర్వేద, యునానీ ఆస్పత్రుల ఎదుట క్రీడాకారులకు క్రికెట్‌ కిట్లు సరసమైన ధరకు లభిస్తున్నాయి. గుజరాత్‌ నుంచి వలస వచ్చిన వారు 20 ఏళ్లుగా క్రికెట్‌ బ్యాట్లు, ఇతర క్రీడా పరికరాలను తయారు చేస్తూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వేలకు వేలు ఖర్చు చేసి షోరూమ్‌లలో క్రీడా వస్తువులు కొనలేని మధ్య తరగతి, పేద క్రీడాకారులు వారి వద్ద కొనుగోలు చేస్తున్నారు.

సైజును బట్టి..

బ్రాండెడ్‌ క్రికెట్‌ బ్యాట్‌ రూ. 5 వేల నుంచి 10 వేలు, వికెట్లు రూ. 2 వేల నుంచి 5 వేలు ఉంటాయి. ఎర్రగడ్డలో సైజులను బట్టి క్రికెట్‌ బ్యాట్ల ధరలు రూ. 50 నుంచి రూ. 250కి లభిస్తున్నాయి. చిన్నవి అయితే రూ. 50, మిడిల్‌ సైజ్‌ రూ. 150, పెద్దవి రూ. 250కి విక్రయిస్తున్నారు. వికెట్లను సైజును బట్టి రూ. 30 నుంచి రూ. 150కి లభిస్తున్నాయి. క్యారమ్‌ బోర్డ్స్‌ కూడా విక్రయిస్తున్నారు.

Advertisement
Advertisement