వరసిద్ధుడికి మహా లఘుదర్శనమే

ABN , First Publish Date - 2020-06-04T10:41:24+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వరసిద్ధుడి దర్శనానికి భక్తులకు అవసమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని ..

వరసిద్ధుడికి మహా లఘుదర్శనమే

ఐరాల(కాణిపాకం), జూన్‌ 3: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో వరసిద్ధుడి దర్శనానికి భక్తులకు అవసమైన ఏర్పాట్లను  సిద్ధం చేసుకోవాలని దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాస్‌   కోరారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ఇక్కడి ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని, ప్రవేశ ద్వారం వద్ద ప్రతి ఒక్కరు శానిటైజర్‌తో తమ చేతులను శుభ్రం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.


ఆలయ  సమీపంలో ఉన్న దుకాణాల్లో మాస్కులను విక్రయించేలా చూడాలన్నారు. ఆలయ అధికారులందరూ మాస్కులతో పాటు చేతికి గ్లోవ్స్‌ తొడుక్కోవాలని సూచించారు. స్వామి దర్శనానికి భక్తులను అనుమతించే సమయంలో ప్రతి భక్తుడికీ మధ్య ఆరడుగుల దూరం కచ్చితంగా పాటించాలన్నారు.  కేవలం మహా లఘుదర్శనాన్ని మాత్రం అనుమతించాలన్నారు. దర్శనం తేదీ సహా ఆలయాన్ని ఎన్ని గంటలకు తెరవాలి, ఎంతమంది భక్తులను అనుమతించాలన్న విషయాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. 

Updated Date - 2020-06-04T10:41:24+05:30 IST