దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ!

ABN , First Publish Date - 2022-06-27T05:23:31+05:30 IST

ఈసారి కొన్ని ప్రాంతాల్లో తొలకరి వానలు సమయానికే వచ్చి మురిపించినా రోహిణి, మృగశిర కార్తెల్లో పంటలు వేసుకునేందు కు అనుకూలమైన వర్షాలు కురియలేదు.

దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ!


  • కానరాని వాన జాడ
  • కారుమబ్బులతో వరుణుడు దోబూచులాట
  • చెలక పొలాల్లో విత్తనాలు విత్తేందుకు దాటుతున్న అదును
  • నల్ల రేగళ్లలో మరిన్ని రోజుల వరకు అవకాశం
  • ఆకాశానికేసి ఆశగా ఎదురు చూస్తున్న రైతులు

ఈసారి కొన్ని ప్రాంతాల్లో తొలకరి వానలు సమయానికే వచ్చి మురిపించినా రోహిణి, మృగశిర కార్తెల్లో పంటలు వేసుకునేందు కు అనుకూలమైన వర్షాలు కురియలేదు. ఆకాశం రోజూ మేఘావృతమైతున్నప్పటికీ వాన పడడంలేదు. పరిగి, తాండూరు, వికారాబాద్‌ ప్రాంతాల్లో చినుకు రాలక అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఉష్ణోగ్రతలూ భారీగానే నమోదువుతున్నాయి.

పరిగి/తాండూరు జూన్‌ 26: ఈసారి తొలకరి ముందుగా ప్రారంభమైనట్లు.. తొందరగానే వాతావరణంలో మార్పులు కనిపించినప్పటికీ రైతులకు నిరాశే ఎదురవుతున్నది. పదిహేను రోజుల క్రితం వర్షం కు రిసి మురిపించింది. ఆ తర్వాత నిత్యం ఆకాశంలో మార్పులు సంభవిస్తున్నా చినుకులు కురియక దోబూడులాడుతోంది. రోహిణి, మృగశిర కార్తెలు దాటాయి. ఇప్పటికే చెలకపొలాల్లో విత్తనాలు నాటడం పూర్తి కావాల్సి ఉంది. వాన చినుకులు వచ్చినట్టే అన్పించి కురియకపోవడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. జిల్లాలో అక్కడక్కడ చిన్నచిన్న వానలు కురుస్తున్నా విత్తనాలు విత్తుకునే స్థాయిలో పడడంలేదని రైతులు వాపోతున్నారు. రైతులు భూములన్నీ చదును చేసి పంటల సాగుకు సిద్ధం చేసి భారీ వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు భూమి తడిసేలా వాన కురుస్తుందా.. ఎప్పుడు విత్తనాలు వేద్దామా? అని కళ్లలో వొత్తులు వేసుకొని వేచి ఉన్నారు. వర్షాలు కురిస్తే ఈపాటికి పొలాల్లో విత్తనాలు విత్తడం పూర్తయ్యేదని చెబుతున్నారు. అయితే ఇంకా ఎక్కడ కూడా విత్తనాలు వేసిన పొలాలు కన్పించడం లేదు. నేల తడిసేంత వర్షం ఇప్పటి వరకు పడకపోవడంతో అన్నదాతలు దీనంగా అకాశం వైపు చూస్తున్నారు. పదిహేను రోజులుగా చిన్నపాటి జల్లులే పడ్డాయి. ఈ మాత్రం పదనలో విత్తనాలు వేస్తే మొలకెత్తవు. రైతులు పడిన శ్రమ, విత్తనాలు, ఎరువులన్నీ వృథా అవుతాయి.

సర్కారు సాయం అంతంతే!

రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ నామమాత్ర చేయూతనే ఇస్తోంది. రైతులకు సబ్సిడీ విత్తనాలు అ యితే పూర్తిగా నిలిపివేశారు. ఎరువులు, పురుగు మందుల ధరలు భారీ గా పెరిగాయి. రైతులు తమకు తెలిసిన విత్తనాలను మార్కెట్లో కొనుక్కొని వేసుకుంటున్నారు. కరువు పరిస్థితులు రైతులను వెంటాడుతున్నాయి. ఈ వానకాలంలో జిల్లాలో వివిధ రకాల పంటలు 5.9లక్షల ఎకరాల్లో సాగుచేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి, కంది పంటలే ఎక్కువగా సాగు చేస్తారు. పత్తి గత ఏడాది 2లక్షల ఎకరాల్లో సాగు చేయగా, సారి 2.6లక్షల ఎకరాలు సాగు చేసే అవకాశం ఉంది. ఈసారి పత్తి ధర ఆశించినదాని కంటే ఎక్కువ పలకడంతో ఈ పంటను మరింత విస్తీర్ణంలో సాగుచేస్తారని అనుకుంటున్నారు. కంది 1,65,900 ఎకరాలు, లక్షకుపైగా ఎకరాల్లో మొక్కజొన్న, వరి 35వేల ఎకరాలు, పెసర 20,800, జొన్న 15 వేలు, మినుములు 9,500ఎకరాల్లో సాగుచేస్తారనే అంచనాలతో వ్యవ సాయ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అలాగే స్వల్ప విస్తీ ర్ణంలో కూరగాయ, ఇతర దినుసు పంటలూ సాగుచేసే అవకాశం ఉం ది. గతానుభవాల దృష్ట్యా ఈసారీ అన్ని రకాల పంటలు కలిసి సాధార ణ విస్తీర్ణాణానికి కొద్ది మేర పెరగొచ్చనే అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అనుకూల వర్షాలు కురియకపోవడంతో రైతులు విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని ఎదురుచూస్తున్నారు. మరో వారం పది రోజుల వరకై నా భారీ వర్షాలు కురియకుంటే సాగువిస్తీర్ణం తగ్గే ఆస్కారముంది.

తాండూరులో గతేడాది జూన్‌లో భారీ వర్షాలు 

  • ప్రస్తుతం 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఎంతో కొంత వర్షం కురియ గా, తాండూరులో మాత్రం ఇంకా తొలకరి వర్షాలు తొంగి చూడలేదు. ఇప్పటికే రైతులు విత్తనాలు విత్తుకునేందుకు అన్ని రకాలు గా సిద్ధమై వానల కోసం ఎదురు చూస్తున్నారు. గతేడాది జూన్‌ లో 19వ తేదీ వరకు ఆరు రోజులు వర్షాలు కురిసి 66.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్‌లో ఇప్పటి వర కు రెండు సార్లు మాత్రమే వర్షం కురిసి 25.1ఎంఎంల స్వల్ప వర్షపాతమే నమోదైంది. వారంపది రోజులుగా తాండూరులో ఉష్ణోగ్రతలు ఎండకాలాన్ని తలపిస్తూ 38 డిగ్రీల వరకు నమోదువుతున్నాయి. సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లబడి చిరు జల్లు లు కురుస్తున్నప్పటికీ నేల తడిసేలా మాత్రం వర్షాలు కురియడం లేదు. ఈ చిరు జల్లులు అనుకూలం కాదు. వ్యవసాయానికి సిద్ధమైన రైతులు రోజులుగా వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే విత్తనాలు విత్తుకునేందుకు ఇంకా సమయం ఉం దని, కొన్ని పంటలు జూలై నెలలో కూడా వేసుకోవచ్చని తాండూ రు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సు ధాకర్‌ తెలిపారు. ఈసారి తాండూరులో కంది కంటే పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

చెలక నేలల్లో అదును దాటుతోంది

మృగశిర కార్తె ప్రారంభమై నాలుగు వారాలు కావొస్తోంది. చెలక నేలల్లో ఇప్పటికే విత్తనాలు విత్తాల్సింది. ఈ కార్తె కంటే ముందు వర్షపు చినుకు లు మురిపించి ఇప్పుడు జాడలేకుం డా పోయాయి. కొన్నాళ్లుగా మాకు వర్షం లేదు. విత్తనాలు, ఎరువులు తెచ్చుకొని సిద్ధంగా ఉంచాం. వర్షం కురిస్తే విత్తనాలు విత్తుకుంటాం.

                                                                          - టి.మైపాల్‌, రైతు,బాసుపల్లి

Updated Date - 2022-06-27T05:23:31+05:30 IST