Abn logo
Oct 11 2021 @ 23:44PM

ఒంటరి ఏనుగు బీభత్సం!

గుడి వద్ద సంచరిస్తున్న ఏనుగు

  దుగ్గిలో విధ్వంసం  

 రెండు దూడలు మృత్యువాత

కొమరాడ: ఒంటరి ఏనుగు (హరి) బీభత్సం సృష్టిస్తోంది. ఏనుగుల గుంపు నుంచి విడిపోయి గ్రామాల్లో సంచరిస్తోంది. ఆదివారం రాత్రి రెండు అవు దూడలను హతమార్చింది. దుగ్గి గ్రామా నికి చెందిన బి.లక్షుంనాయు డుకు చెందిన రెండు ఆవు దూడలపై దాడి చేయడంతో మృత్యువాత పడ్డాయి. గ్రామ సమీపంలో ఉన్న గుడి వద్ద స్తంభాలు, పైపులను ధ్వంసం చేసింది. ఏ క్షణంన ఏనుగు దాడి చేస్తుందోన ని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  పొలాలకు వెళ్లే రైతులు సాయంత్రం 4 గంటల్లోగా ఇళ్లకు చేరుకోవాలని అటవీ శాఖ అధికారులు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. ఏనుగు దాడిలో మృతి చెందిన ఆవు దూడలకు కొమరాడ పశు వైద్యాధికారి సత్యనారాయణ సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు.