Abn logo
Dec 2 2020 @ 23:59PM

జాతీయ లోక్‌అదాలత్‌లో కేసుల పరిష్కారానికి చర్యలు

మాట్లాడుతున్న అర్బన్‌ అదనపు ఎస్పీ గంగాధరం, పక్కన డీసీఆర్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు

గుంటూరు, డిసెంబరు 2: జాతీయలోక్‌ అదాలత్‌లో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని అర్బన్‌ జిల్లా అదనపు ఎస్పీ గంగాధరం అన్నారు. బుధవారం ఆయన పోలీస్‌ కార్యాలయంలోని గ్రీవెన్స్‌ భవన్‌లో కోర్టు కానిస్టేబుళ్ళతో సమావేశమయ్యారు.  ఈ నెల 12న జరిగే జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో అర్బన్‌లోని అన్ని పోలీస్‌స్టేషన్‌లలో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారమయ్యేలా తగుచర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత సమాచారాన్ని వెంటనే డీసీఆర్‌బీకి తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఎంఎస్‌ ఎస్‌ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement