బ్రెడ్ కోసం 365 కిలోమీటర్ల కారు ప్రయాణం... తరువాత...

ABN , First Publish Date - 2020-04-08T18:24:36+05:30 IST

కరోనావైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలలో లాక్డౌన్ అమలులో ఉంది. ఇటువంటి పరిస్థితిలో కొంతమంది తమ అవసరాలను...

బ్రెడ్ కోసం 365  కిలోమీటర్ల కారు ప్రయాణం... తరువాత...

లండన్: కరోనావైరస్ కారణంగా ప్రపంచంలోని చాలా దేశాలలో లాక్డౌన్ అమలులో ఉంది. ఇటువంటి పరిస్థితిలో కొంతమంది తమ అవసరాలను తీర్చుకునేందుకు చాలా దూరం ప్రయాణించాల్సివస్తోంది. ఇటీవల ఒక వ్యక్తి బ్రెడ్ కొనుగోలు చేసేందుకు తన ఇంటి నుండి 368 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం యుకెలో లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఒక వ్యక్తి గంటకు 177 కిలోమీటర్ల  వేగంతో డ్రైవింగ్ చేయడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. పోలీసులు ఆ వ్యక్తి కారును అడ్డుకోగా, తాను చౌకగా దొరికే బ్రెడ్ కోసం లండన్ వెళ్తున్నానని చెప్పాడు. ఈ సంఘటన గురించి లీసెస్టర్‌షైర్ రోడ్ పోలీస్ యూనిట్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. తాము అత్యంత వేగంగా వెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నామని, ఆ కారులో ఉన్న వ్యక్తి  నాటింగ్హామ్ నుండి లండన్ వెళుతున్నాడని తెలిపారు. అక్కడ  బ్రెడ్ ఒక  పౌండ్ తక్కువ అని చెప్పాడన్నారు. ఆ వ్యక్తితో పాటు కారులో అతని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన అతని గురించి కోర్టుకు తెలియజేశామన్నారు.


Updated Date - 2020-04-08T18:24:36+05:30 IST