ఒమైక్రాన్ ఎఫెక్ట్: మహారాష్ట్రలో త్వరలో Lockdown ?

ABN , First Publish Date - 2022-01-01T14:28:38+05:30 IST

మహారాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 8,067 కొవిడ్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో త్వరలో లాక్‌డౌన్ విధిస్తారా అంటే...

ఒమైక్రాన్ ఎఫెక్ట్: మహారాష్ట్రలో త్వరలో Lockdown ?

ముంబై : మహారాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 8,067 కొవిడ్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో త్వరలో లాక్‌డౌన్ విధిస్తారా అంటే అవునంటున్నారు మహారాష్ట్ర మంత్రి. మహారాష్ట్రంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున లాక్ డౌన్ విధించే దశ సమీపిస్తుందని రాష్ట్ర మంత్రి విజయ్ వాడెట్టివార్ చెప్పారు. గత 24 గంటల్లోనే మహారాష్ట్రంలో అనూహ్యంగా కొవిడ్ కేసుల సంఖ్య పెరిగింది. ‘‘మహారాష్ట్రలో లాక్‌డౌన్ దశ సమీపిస్తోంది. అయితే లాక్‌డౌన్ ఎప్పుడు విధించాలనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు’’ అని రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ మంత్రి వాడేట్టివార్‌ చెప్పారు.ప్రయాణాలు, కళాశాలలపై ఆంక్షలు విధిస్తామని మంత్రి తెలిపారు.


మహారాష్ట్రలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 66,78,821కి పెరగ్గా,1,41,526మంది మరణించారు.మహారాష్ట్రలో 24,509 యాక్టివ్ కేసులున్నాయి.మహారాష్ట్రలో 454 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి.జనవరి 3వ వారం నాటికి మహారాష్ట్రలో 2 లక్షల యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యే అవకాశముందని మహారాష్ట్ర అదనపు చీఫ్ హెల్త్ సెక్రటరీ చెప్పారు.మహారాష్ట్ర ప్రభుత్వం వివాహాలు, సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు,అంత్యక్రియలకు హాజరుపై కొత్త ఆంక్షలను ప్రకటించింది.


Updated Date - 2022-01-01T14:28:38+05:30 IST