లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌... మూతబడిన ప్రార్థనా మందిరాలు

ABN , First Publish Date - 2022-01-08T14:13:24+05:30 IST

కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు మూతబడ్డాయి. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు ఆధ్యాత్మిక ప్రాంతాలను

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌... మూతబడిన ప్రార్థనా మందిరాలు

ప్యారీస్‌(చెన్నై): కరోనా మహమ్మారి కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు మూతబడ్డాయి. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు విధించిన నిషేధం శుక్రవారం అమలులోకి వచ్చింది. మహిళలకు శుక్రవారం పవిత్రమైన రోజు కావడంతో అమ్మవారి ఆలయాలకు వెళ్లగా అక్కడ గేట్లు మూసివుండడంతో నిరాశతో వెనుదిరిగారు. మరికొంతమంది మాత్రం గేటు ముందే దీపాలు వెలిగించి, పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మదురై మీనాక్షి, కంచి కామాక్షి, సమయపురం మారియమ్మ, తిరెచెందూర్‌ సుబ్రమణ్య స్వామి దేవాలయం సహా అన్ని ఆలయాలు మూసివుండడంతో ఆయా ప్రాంతాలు భక్తుల్లేక వెలవెలపోయాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయాల్లో మాత్రం శుక్రవారం రోజువారీ పూజలు అర్చకులు నిర్వహించారు. అదే విధంగా నాగపట్నం జిల్లాలో నాగూర్‌ దర్గా, కోవం దర్గా తదితరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని మసీదులు మూతబడ్డాయి. శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు అవకాశం లేకపోవడంతో పలువురు ముస్లింలు వెనుదిరిగారు. నాగపట్నం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వేలాంకన్ని దివ్యక్షేత్రం, స్థానిక బీసెంట్‌నగర్‌లోని వేలాంకన్ని మందిరం, శాంథోమ్‌ చర్చి, సెయింట్‌ థామ్‌సమౌంట్‌ చర్చి తదితరాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వున్న చర్చీలను కూడా ఈ మూడు రోజులు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు జరుపుకునేందుకు అవకాశం లేకపోయింది.

Updated Date - 2022-01-08T14:13:24+05:30 IST