కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-06-15T06:20:27+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్‌ పోలీసులు పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. సోమవారం సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఎస్పీ రాహుల్‌హెగ్డే వాహనాలను తనిఖీ చేశారు.

కొనసాగుతున్న లాక్‌డౌన్‌
వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే

సిరిసిల్ల, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో లాక్‌డౌన్‌ పోలీసులు పకడ్బందీగా అమలుపరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. సోమవారం సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద  ఎస్పీ రాహుల్‌హెగ్డే  వాహనాలను తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం ముగిసిన తరువాత రోడ్లపైకి వచ్చిన వారి వివరాలు తెలుసుకున్నారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి  వాహనాలను సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల తరువాత  అనవసరంగా రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు లాక్‌డౌన్‌ నిబంధనల  ఉల్లంఘనపై 6335 కేసులు నమోదు చేశామన్నారు. 586 వాహనాలను, 86 దుకాణాలను సీజ్‌ చేశామన్నారు. రూ 58.41 లక్షల జరిమానా విధించినట్లు చెప్పారు.  సీఐ అనిల్‌కుమార్‌, శిక్షణ ఎస్సైలు అపూర్వ, సంధ్య, తిరుపతి ఉన్నారు. 

Updated Date - 2021-06-15T06:20:27+05:30 IST