Abn logo
Oct 23 2021 @ 00:07AM

అనంతపురం డీవైఈఓ ఆఫీ్‌సకు తాళం...!

తాళం వేసిన దృశ్యం

అనంతపురం విద్య, అక్టోబరు 22: అనంతపురం డిప్యూటీ డీఈఓ (డీవైఈఓ) కార్యాలయానికి శుక్రవారం తాళం వేశారు. ఆ సిబ్బంది విధులకు హాజరయ్యారా .. ఇతర ప్రాంతాలకు వెళ్లారా... విధులకు డుమ్మా కొట్టారో తె లియదు కానీ... ఆఫీ్‌సకు మాత్రం తాళం పడింది. దీంతో పలు పనులపై, సమస్యలపై ఆఫీ్‌సకు వచ్చిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రైవేట్‌ స్కూళ్ల కరస్పాండెంట్లు, ప్రజలు నిరాశతో వెనుతిరగారు. అనంతపురం డీవైఈఓగా పనిచేస్తున్న దేవరాజ్‌ను ఇటీవల కడపకు బదిలీ చేశారు. దీంతో ఇటీవలే ధర్మవరం డీవైఈఓ మీనాక్షికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ డీఈఓ ఉ త్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె ధర్మవరంలోనే ఎక్కువ కాలం ఉంటూ అనంతపురం డివిజన్‌ పై పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి.