రుణాలను సకాలంలో అందజేయాలి

ABN , First Publish Date - 2020-06-06T11:28:47+05:30 IST

రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఇతర లబ్ధిదారులకు రుణాలను సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

రుణాలను సకాలంలో అందజేయాలి

బ్యాంకర్లతో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి 


నిజామాబాద్‌ అర్బన్‌, జూన్‌ 5: రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఇతర లబ్ధిదారులకు రుణాలను సకాలంలో అందజేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బ్యాంకర్లకు సూచించారు. కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌లో శుక్రవారం సం ప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ, రుణాలు అందజేయడంలో బ్యాంకులు ముందంజలోనుండాలని సూచించారు. ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే సంబంధిత శా ఖాధికారులతో సంప్రదించి పరిష్కరించాలని, నెలాఖరునాటికి వందశాతం రుణాల లక్ష్యం పూర్తిచేయాలన్నారు.


ఎంఎస్‌ఎంఈలకు వర్కింగ్‌ క్యాపిటల్‌లో 20 శాతం కోవిడ్‌ రుణాలు జూన్‌ 30వ తేదీలోగా అందజేయాలన్నారు. అలాగే భూమి ఉన్న మత్స్యకారులకు కేసీసీ లోన్‌ ఇవ్వాలని, వారికి టర్మ్‌లోన్‌ ఉంటే దానిని కేసీసీకి మార్పుచేయాలని సూచించారు. మొండి బకాయిలు లేని వీధివ్యాపారులకు 15 రోజుల్లోగా రూ.10 వేల వరకు రుణాలు మంజూరుచేయాలన్నారు. ఈ సమావేశంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-06T11:28:47+05:30 IST