Abn logo
Apr 14 2021 @ 17:23PM

బీజేపీ బయట వ్యక్తులతోనే బెంగాల్‌లో కరోనా కేసుల పెరుగుదల: మమత

కోల్‌కతా: బెంగాల్‌కు బయట నుంచి వ్యక్తులను బీజేపీ తీసుకోవస్తోందని, రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈ చర్య దోహదపడుతోందని టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాము కోవిడ్ పరిస్థితిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తుంటే, వాళ్లు (బీజేపీ) మరింత సంక్లిష్ట చేస్తున్నారని అన్నారు. గరిష్టంగా రాష్ట్రంలోని అందిరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను సైతం బీజేపీ సారథ్యంలోని కేంద్రం పెడచెవిన పెడుతోందని మమత విమర్శించారు. నాలుగో విడత ఎన్నికల తరుణంలో సీఐఎస్‌ఎఫ్ జరిపిన కాల్పుల్లో మృతులను ఆదుకుంటామని, ఈ ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెట్టేందుకు దర్యాప్తు జరుపుతామని కూడా ఆమె హామీ ఇచ్చారు. తొలిసారి ఓటరుగా నమోదైన 18 ఏళ్ల ఆనంద్ బర్మన్ కుటుంబానికి న్యాయం చేస్తామని బెనర్జీ వాగ్దానం చేశారు. కూచ్ బెహర్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వెలుపల కాల్చివేతకు గురై ఆనంద్ బర్మన్ మృతిచెందాడు.


Advertisement
Advertisement