Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వర్గం చూసొద్దామా!

ఒక ఊరిలో ఓ రైతు ఉండేవాడు. ఒకరోజు అతని చెరకు తోటలో ఏదో జంతువు చేరి చెరకు గడలు తిన్నట్టు గమనించాడు. ఆ జంతువేదో తెలుసుకోవాలనుకున్నాడు. అర్ధరాత్రి వేళ చూడటానికి బయలుదేరాడు. తోటలో అలికిడి అవుతుండటంతో గమనించాడు. ఒక తెల్ల ఏనుగు చెరకు గడలు తింటూ కనిపించింది. అది చూసిన వెంటనే రైతు అరుస్తూ దాన్ని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. రైతును గమనించిన ఏనుగు వెళ్లిపోయేందుకు గాల్లోకి ఎగిరింది. రైతు పరుగెత్తుకుంటూ వెళ్లి ఏనుగు తోక అందుకున్నాడు. ఏనుగు ఎగరడం వింతగా అనిపించింది. ఆ ఏనుగు ఎగురుకుంటూ మేఘాలపైకి చేరుకుంది. అక్కడ పెద్ద తోట కనిపించింది. బహుశా అది స్వర్గం అయి ఉంటుంది అనుకున్నాడు. ఆ తోటలో పండ్లు తెంపుకొని తిన్నాడు. అవి చాలా తియ్యగా ఉన్నాయి. స్నేహితుల కోసం కొన్ని పండ్లను జేబులో పెట్టుకున్నాడు. కాసేపయ్యాక ఆ ఏనుగు మళ్లీ ఎగిరింది. పరుగున వెళ్లి మళ్లీ తోక అందుకున్నాడు. ఏనుగు చెరకు తోట దగ్గర దిగింది. అక్కడి నుంచి రైతు ఇంటికి వెళ్లి జరిగిందంతా స్నేహితులకు చెప్పాడు. ఆ పండ్లను తినమని ఇచ్చాడు. వాళ్లుకూడా చాలా రుచిగా ఉన్నాయని అన్నారు. మేము కూడా స్వర్గం చూస్తాం అనడంతో మరుసటి రోజు రాత్రి మళ్లీ తోటకు వెళదాం అని అన్నాడు రైతు. అనుకున్నట్టుగానే  అందరూ కలిసి రాత్రివేళ తోటకు బయలుదేరారు. అక్కడ తెల్ల ఏనుగు చెరకు గడలు తింటూ కనిపించింది. వాళ్లను చూసి ఏనుగు గాల్లోకి ఎగిరింది. పరుగున వెళ్లిన రైతు దాని తోక అందుకున్నాడు. మరో వ్యక్తి ఆ రైతు కాలు పట్టుకున్నాడు. అందరూ ఒకరి కాళ్లు మరొకరు పట్టుకుని గాల్లోకి ఎగిరారు. గాల్లో ఎగురుతుండగానే స్నేహితులు మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. అందులో ఒకడు అక్కడ తోటలో పుచ్చకాయలు ఉన్నాయా? అని రైతుని అడిగాడు. ఆ రైతు ఉన్నాయని సమాధానమిచ్చాడు. చాలా పెద్దవి ఉన్నాయా? అని మళ్లీ అడిగాడు. అవును అని రైతు సమాధానం ఇచ్చాడు. ఎంత పెద్దవి? అని మళ్లీ అడిగాడు. ఇంత పెద్దవి అని ఏనుగు తోకను వదిలేసి రెండు చేతులతో చూపించాడు రైతు. అంతే... అందరూ కింద పడ్డారు. ఆ తరువాత మళ్లీ ఏనుగు ఎప్పుడైనా వస్తుందేమోనని చూశారు. కానీ ఏనుగు మళ్లీ ఆ తోటకు రాలేదు.

Advertisement
Advertisement