స్టోరీల షేరింగ్‌ నచ్చిన వారికే!

ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST

సామాజిక వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌ కూడా పాపులర్‌ అన్న సంగతి తెలిసిందే. రోజూ 500 మిలియన్ల మంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ..

స్టోరీల షేరింగ్‌ నచ్చిన వారికే!

సామాజిక వేదికగా ఇన్‌స్టాగ్రామ్‌ కూడా పాపులర్‌ అన్న సంగతి తెలిసిందే.  రోజూ 500 మిలియన్ల మంది దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సెలిబ్రిటీలను అనుసరించడంతో మొదలుపెట్టి, వీడియోల రూపకల్పన, షేరింగ్‌ వరకు పలు కార్యకలాపాలకు ఈ సామాజిక మాధ్యమాన్ని వాడుకుంటారు. దీనికి చెందిన స్టోరీస్‌ ఫీచర్‌తో వీడియోలు, ఫొటోలు, కంటెంట్‌ షేర్‌ చేసుకోవచ్చు. అయితే, సెన్సిటివ్‌ లేదంటే పర్సనల్‌ స్టఫ్‌ను కొందరు చూడటం ఇష్టం ఉండదు. అలాగని ఆ వ్యక్తులను బ్లాక్‌ చేయాలని మాత్రం కాదు. షేర్‌ చేసుకోరాదని మాత్రమే అనుకున్న పక్షంలో ఏం చేయాలంటే...

ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ని ఓపెన్‌ చేయాలి. 

 స్ర్కీన్‌ రైట్‌ బాటమ్‌ కార్నర్‌లో ప్రొఫైల్‌ పిక్చర్‌ని టాప్‌ చేయాలి. 

 టాప్‌ రైట్‌లో ఉన్న మూడు అడ్డ గీతలను టాప్‌ చేసి, సెట్టింగ్స్‌పై క్లిక్‌ చేయాలి.

 ప్రైవసీ సెక్షన్‌లోకి వెళ్ళి స్టోరీని టాప్‌ చేయాలి. 

 అక్కడే ‘హైడ్‌ స్టోరీ ఫ్రమ్‌’ అని అప్షన్‌ ఉంటుంది. దాన్ని టాప్‌ చేసి హైడ్‌ చేయదలిచిన వ్యక్తులను టాప్‌ చేయాలి.

 హైడ్‌ చేయాలనుకున్న వ్యక్తుల ఇన్‌స్టాగ్రామ్‌ ఫైల్స్‌ని వెతికి ఎంపిక చేసుకుంటే చాలు. ఐఫోన్‌ అయితే ప్రాసెసర్‌ పూర్తి కోసం లిట్రల్‌గా టాప్‌ చేయాలి. తీసేయాలని అనుకుంటే వారి పేరు ముందు ఉన్న బ్లూ టిక్‌ను క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST