విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు

ABN , First Publish Date - 2022-06-30T05:43:18+05:30 IST

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణి పేర్కొన్నారు.

విజ్ఞాన భాండాగారాలు గ్రంథాలయాలు
సభనుద్దేశించి మాట్లాడుతున్న ఉషారాణి

జిల్లా గ్రంథాలయసంస్థ చైర్‌పర్సన్‌


కడప మారుతీనగర్‌, జూన్‌ 29:  గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ లింగాల ఉషారాణి పేర్కొన్నారు.  స్థానిక ఐఎంఏ మీటింగ్‌ హాలులో నిర్వహించిన గ్రంథాలయాల వారోత్సవాల (వేసవి విజ్ఞాన శిబిరాలు) ముగింపు సభలో ఆమె మాట్లాడుతూ వేసవి సెలవుల నేపథ్యంలో మే 17 నుంచి జూన్‌ 30 వరకూ 45 రోజులు జిల్లాలోని 52 గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించామన్నారు. సెలవుల్లో విద్యార్థులు తల్లిదండ్రులకు భారం కాకుండా, ప్రత్యేక నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రభుత్వ ఆదేశాలమేరకు గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.  నగర మేయర్‌ సురే్‌షబాబు మాట్లాడుతూ విద్యకు ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తోందన్నారు. సమగ్ర శిక్ష పథక అధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యకు మించిన ఆస్తి మరొకటి లేదన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయసంస్థ సెక్రటరీ అమీనుద్దీన్‌, కడప మండల విద్యాశాఖ అధికారి పాలెం నారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-30T05:43:18+05:30 IST