కొవిడ్‌ నియంత్రణకు కలిసికట్టుగా పనిచేద్దాం

ABN , First Publish Date - 2021-04-17T06:22:47+05:30 IST

కొవిడ్‌ నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని డీఎస్పీ మహబూబ్‌బాష అన్నారు.

కొవిడ్‌ నియంత్రణకు కలిసికట్టుగా పనిచేద్దాం
హిందూపురంలో అవగాహనకల్పిస్తున్న డీఎస్పీ మహబూబ్‌భాషా

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 16: కొవిడ్‌ నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని డీఎస్పీ మహబూబ్‌బాష అన్నారు. శుక్రవారం వనటౌన పోలీ్‌సస్టేషనలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మెడికల్‌ స్టోర్‌, వస్త్రదుకాణ అసోసియేషన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కొవిడ్‌-19 సెకెండ్‌వేవ్‌ విపరీతంగా విస్తరిస్తున్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే మెడికల్‌షాపులు, దుకాణాలకు వచ్చేవారికి తప్పనిసరిగా మాస్కులు ధరించేలా అవగాహన కల్పించాలన్నారు. శానిటైజర్‌ వినియోగం, భౌతికదూరం పాటించకపోతే చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు బాలమద్దిలేటి, మన్సూరుద్దీన, ధరణికిషోర్‌లు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T06:22:47+05:30 IST