Advertisement
Advertisement
Abn logo
Advertisement

అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం: గౌరవ సభలో టీడీపీ నాయకులు

గార్లదిన్నె, డిసెంబరు 8 : రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అక్రమాల పాలనకు చరమ గీతం పాడి... 2024లో చంద్రబునాయుడును సీఎం చేయడమే లక్ష్యంగా పని చేయాలని శిం గనమల నియోజకవ్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు పేర్కొన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునా యు డు పిలుపు మేరకు ద్విసభ్య కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని మర్తాడు గ్రామంలో గౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చ ర్చించకుండా చంద్రబాబునాయుడుపై వ్యక్తిగత ధూషణలు చేసి కించపర చడమే కాకుండా గౌరవ సభను కౌరవ సభగా మార్చారన్నారు. ఆ రోజలు చంద్రబాబు నాయుడు చేసిన శపథాన్ని నిజం చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యంగా సీఎం జగన అవగాహన లేని పాలన వల్ల రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ జయారం, మా జీ వైస్‌ ఎంపీపీ ఆవుల కిష్టయ్య, గ్రామ అధ్యక్షులు సురేష్‌, మాజీ ఎంపీటీసీ సుబ్బయ్య, గొరకాటి వెంకటేసు, శీతారామయ్య, కుళ్లాయి. శేఖర్‌, శీనా, వీరాంజి, బెస్త సూరీ, వీరనారాయణ, ఆవుల సురేష్‌, ఎల్లప్ప, బూడిద కిష్ట, పెనకచెర్ల శీనా, గోసుల సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. 

అనంతపురంరూరల్‌: ప్రజల సమస్యల పరిష్కారంలో అన్నింటా ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకులు విమర్శించారు. మండలంలోని అనంతపురం రూరల్‌ పంచాయతీ నారాలోకేష్‌ కాలనీలో ప్రజా సమస్యలపై బుధవారం సాయంత్రం టీడీపీ నాయకుడు బంగినాగ అధ్యక్షతన గౌ రవ సభ కార్యక్రమం చేపట్టారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రంగరాజు నాగరాజు, అధికార ప్రతినిధి నారాయణస్వామి యాదవ్‌, నగర అధ్య క్షుడు మారుతికుమార్‌ గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికొదిలేసిందన్నారు. సమస్యలను పట్టించుకోక పోగా... వారిపై ధరల భారం వేస్తోందన్నారు. రోజు రోజుకు ప్రభుత్వం ప్రజల మద్ధతు కోల్పోతోందన్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం సరికాదన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచితంగా ఇళ్లకు రిజిస్ట్రేషన చేయిస్తామని మాజీ ముఖ్య మంత్రి నారాయచంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ శేఖర్‌, టీఎనటీయూసీ పార్లమెంట్‌ అధ్యక్షుడు మేకల వెంకటేష్‌గౌడ్‌, టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు లక్ష్మీనరసింహులు, రైతు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రఘునాథ్‌, టీఎనటీయూసీ నగర అధ్యక్షుడు పూల బాషా, మైనార్టీ నాయకులు జేఎం బాషా, శ్రీనివాసచౌదరి, మట్టా కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement