అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం

ABN , First Publish Date - 2021-10-22T05:59:36+05:30 IST

అమరుల ఆశయసాధనకు పునరంకితమ వుదామని సీఐ కరుణాకర్‌ పేర్కొన్నారు.

అమరుల ఆశయసాధనకు పునరంకితమవుదాం

పోలీసు అమరవీరుల దినోత్సవంలో సీఐ

ధర్మవరం, అక్టోబరు 21: అమరుల ఆశయసాధనకు పునరంకితమ వుదామని సీఐ కరుణాకర్‌ పేర్కొన్నారు. పోలీసుల అమరవీరుల దినో త్సవం సందర్భంగా గురువారం  పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఉన్న అమర వీరు ల స్థూపానికి పూలమాలలు వేసి  ఆయన సెల్యూట్‌ చేసి అనంతరం సిబ్బందితో అమరవీరుల స్థూపానికి పూలమాల వేయించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా  సీఐ మా ట్లాడు తూ... పరిరక్షణ, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతచాంద స వాదులు, అ సాం ఘిక శక్తుల నుంచి సామాన్య మానవులకు రక్షణ కల్పించేందుకు పో లీసు లు తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారన్నారు.  వారి కుటుం బానికి పోలీస్‌ శాఖ ఎల్లవేళలా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.  ప్రతి పోలీసు దేశానికి వెన్నెముక లాంటివాడన్నారు. 

రక్తదాన శిబిరం: రక్తదానం చేయడం వల్ల మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున పేర్కొన్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తబంధం ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని శివానగర్‌ శివాల యం వద్ద గురువారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్‌ కమిషనర్‌ హాజరై రక్తదానం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవచ్చన్నారు. ఎంతో మంది వివిధ ప్రమాదాలకు గురై రక్తం దొరక్క ప్రాణాలు సైతం పొగొట్టుకున్న సందర్భాలున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన యువకులకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు కన్నా వెంకటేశ్‌, మంజు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-22T05:59:36+05:30 IST