Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ, పక్కన కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎస్పీ మలికగర్గ్‌, మేయర్‌ సుజాత

జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ

ఒంగోలు నగరం, డిసెంబరు 6:  అంబేడ్కర్‌ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. అంబేడ్కర్‌ 65వ వర్ధంతి సందర్భంగా స్థానిక హెచ్‌సీఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌  విగ్రహానికి ఆమె పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బానిస బతుకుల నుంచి బడుగు, బలహీన వర్గాల  విముక్తి కోసం అంబేడ్కర్‌ తిరుగులేని పోరాటం చేశారన్నారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అధికార యంత్రాంగం కృషి చేస్తోందని అన్నారు. ఎస్పీ మలికగర్గ్‌ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఇంత బలంగా ఉందంటే అందుకు కారణం అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగమే కారణమన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ విగ్రహానికి జేసీ వెంకట మురళి, మేయర్‌ గంగాడ సుజాత, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ లక్ష్మానాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీనివాస విశ్వనాథ్‌, ఆర్డీవో ప్రభాకరరెడ్డి, డీఈవో విజయభాస్కర్‌, సీపీవో డి.వెంకటేశ్వర్లు, దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, బిళ్ళా చెన్నయ్య, వసంతరావు, చప్పిడి వెంగళరావు, ఆనంద్‌ మాదిగ పాల్గొన్నారు.


Advertisement
Advertisement