Abn logo
Oct 24 2021 @ 00:43AM

బాధిత కుటుంబాలకు అండగా ఉందాం

నివాళి అర్పిస్తున్న అదనపు ఎస్పీ హనుమంతు, కమాండెంట్‌ రామ్మోహన


అనంతపురం క్రైం, అక్టోబరు 23: విధి నిర్వహణలో అమరులైన పోలీసు బాధిత కుటుంబాలకు అండగా ఉందామని జిల్లా ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, కర్నూలు రీజన హోంగార్డ్సు కమాండెంట్‌ రా మ్మోహనరావు పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం వారు కొవిడ్‌ నేపథ్యంలో మృతి చెందిన నగరంలోని పోలీసులు, హోంగార్డుల బాధిత కుటుంబాలను పరామ ర్శించారు. ఇళ్లకు వెళ్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవిష్యతలో అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోంగార్డ్సు ఆర్‌ఐ శివరాముడు పాల్గొన్నారు.

పోలీసు సేవలను గుర్తించాలి

సమాజం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొవిడ్‌లో సేవలందించిన పోలీసుల సేవలను ప్రతిఒక్కరూ గుర్తించాలని సీఐలు కత్తి శ్రీనివాసులు, రెడ్డెప్ప, జాకీర్‌ హూసేన, ప్రతాపరెడ్డి, మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం నగరంలోని పలు కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పోలీసు సేవలపై అవగాహన కల్పించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.  

రాప్తాడు: విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివని ఎస్‌ఐ రాఘవరెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్బంగా శనివారం మండలంలోని రాప్తాడు ఉన్నత పాఠశాల, ఆదర్శ పాఠశాల, హంపాపురం సమీపాన గల శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని విద్యార్థులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు.