రైతులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2021-05-14T06:00:31+05:30 IST

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారు.

రైతులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం
మెగా చెక్కును ఆవిష్కరిస్తున్న నారాయణస్వామి

చిత్తూరు కలెక్టరేట్‌, మే 13: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ  సీఎం నారాయణస్వామి చెప్పారు. రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమాన్ని గురువారం వెలగపూడి నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించగా, కలెక్టరేట్‌ నుంచి డిప్యూటీ సీఎంతోపాటు ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మేయర్‌ అముద, కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి రైతు భరోసా కింద 4,60,389 మంది రైతులకు మొదటి విడత లబ్ధిగా రూ.345.89 కోట్ల మెగా చెక్కును డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి నవరత్నాలను పూర్తి స్థాయిలో సీఎం జగన్‌ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. కరోనాను అరికట్టడానికి శ్రమిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని అభినందించారు. జేసీ రాజశేఖర్‌, డీఆర్వో మురళి, వ్యవసాయశాఖ  జేడీ దొరసాని, ఏడీఏ శివకుమార్‌, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-14T06:00:31+05:30 IST