అబ్దుల్‌కలాంను ఆదర్శంగా తీసుకుందాం..
ABN , First Publish Date - 2022-01-13T06:24:39+05:30 IST
మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పేర్కొన్నారు.
విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు
తాడిమర్రి, జనవరి 12: మాజీ రాష్ట్రపతి, భారతరత్న దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మండల కేంద్రంలోని ఉన్నత పాఠశలలో 1991-92 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు పేర్కొన్నారు. వీరు ఏర్పాటుచేసుకున్న స్ఫూర్తితో వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠ శాల ఆవరణలో బుధవారం అబ్దుల్ విగ్రహావిష్కరణ చేశారు. పెద్దకోట్ల ఆదినారా యణరెడ్డి, కుమార్తె రొద్దం హరిప్రియ భాస్కర్‌రెడ్డిలు విగ్రహాన్ని అందజేయగా వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న తోటి విద్యార్థులకు సహాయ సహకారాలు అందిద్దామని నిర్ణయించుకున్నారు. విగ్రహావిష్కరణ అనంతరం దాతల ను ఘనంగా సన్మానించారు.