పరిశుభ్రత పాటిద్దాం.. డెంగీని నివారిద్దాం

ABN , First Publish Date - 2022-05-17T04:38:30+05:30 IST

దోమ కాటు వలన వ్యాపించే ప్రాణాంతకమైన డెంగీ వ్యాధిని తరిమికొడదామని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు.

పరిశుభ్రత పాటిద్దాం.. డెంగీని నివారిద్దాం
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌

వనపర్తి వైద్యవిభాగం, మే 16: దోమ కాటు వలన వ్యాపించే ప్రాణాంతకమైన డెంగీ వ్యాధిని  తరిమికొడదామని  అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని సోమవారం పాలిటెక్నిక్‌ కళాశాల మైదానం లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ డెంగీ వ్యాధి పగటిపూట కుట్టే దోమ వలన వ్యాపిస్తుందన్నారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు వృద్ధి చెందకుండా మురుగునీరు, నిల్వనీరు ఉండ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇం ట్లోని తలుపులకు, కిటికీలకు దోమలు రాకుండా జాలీ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడేను పాటించాలని సూచించారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, జిల్లా వైద్య ఆరో గ్యశాఖ అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్‌ సౌభాగ్యలక్ష్మి, డాక్టర్‌ సాయినాథ్‌ రెడ్డి, వైద్యులు సృజన, భరద్వాజ్‌, జ్యోషి, బాలమణి, సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాస్‌జీ, కౌన్సిలర్లు నాగ న్న యాదవ్‌, హెల్త్‌ ఎడ్యూకేటర్స్‌ మధు, సాయి రెడ్డి, చంద్రయ్య, విజయ, రత్నకర్‌రెడ్డి, గంధం రాజు, తిరు పతయ్యగౌడ్‌, గోపాల్‌రెడ్డి, రాము, శ్రీను, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 

పెబ్బేరులో..

పెబ్బేరు  : పెబ్బేరు మునిసిపల్‌ కేంద్రంలో సోమ వారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డెంగీ ని వారణ దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు దో మల నివారణ పద్దతులు పాటించాలని, వారానికి ఒకసారి ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పారబోసి కొత్త నీ టిని పట్టుకోవాలని, దోమలు పుట్టకుండా, కుట్టకుం డా చూసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్ర మంలో వైద్యాధికారి సునీల్‌,  హెల్త్‌ సూపర్‌వైజర్‌ సూర్యనారాయణ, స్వరూపరాణి, హెల్త్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌, లక్ష్మిరెడ్డి, ఏఎన్‌ఎం వెంకటమ్మ, శారద, లావన్య, జయశ్రీ పట్టణ ఆశ కార్యకర్తలు, పారామెడికల్‌ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట :జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పుష్పలత మాట్లాడుతూ పగటిపూట దోమలు కుట్టడంతో డెంగీ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. వ్యాధి సోకితే తల నొప్పి, జ్వరం, శరీరంపై ఎర్రటి దద్దుర్లు వంటి లక్ష ణాలు కనిపిస్తాయని తెలిపారు. డెంగీ నివారణ కో సం పరిసరాల్లో నీరు నిల్వఉండకుండా చూసుకోవా లని తెలిపారు. అంతకు ముందు గ్రామంలోని ప్రధా న వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో  ఆరోగ్య విస్తరణ అధికారి సురేష్‌కుమార్‌, సూపర్‌ వైజర్‌ సుచిత్ర, కౌసల్య, సిబ్బంది జ్ఞానేశ్వర్‌, మధు బాబు, వెంకటమ్మ, సుమిత్ర, లలిత, నాగమణి, శోభ, పద్మావతి, విజయ, లత, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌ : డెంగీ నివారణ కోసం ప్రతీ ఒక్కరు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని  ప్రాథమిక ఆరోగ్య విస్తరణాధికారి కొండా శ్రీనివాస్‌ అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా సో మవారం మండల కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌ వైజర్లు సంతోషమ్మ, సుమనశ్రీ, హెల్త్‌ అసిస్టెంట్లు , ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

వీపనగండ్లలో..

వీపనగండ్ల : డెంగీ నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డాక్టర్‌ వంశీకృష్ణ తెలిపారు. సోమ వారం మండల కేంద్రంలో జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. వ్యక్తి గత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించిన ప్పుడే డెంగీ వ్యాధిని నివారించవచ్చునని తెలిపారు.  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్‌ రెడ్డి, సూపర్‌వైజర్‌ జహంగీర్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మదనాపురంలో..

మదనాపురం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం అవగాహన ర్యాలీ నిర్వ హించారు. అనంతరం వైద్యురాలు ఉమ మాట్లాడు తూ డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవ గాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రవీందర్‌గౌడ్‌, సురేష్‌గౌడ్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

అమరచింతలో..

అమరచింత : డెంగీ వ్యాధి సోకకుండా ప్రజలం దరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని జాగ్రత్త వహించాలని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అక్షయ్‌ కు మార్‌ కోరారు. సోమవారం అమరచింతలో దేశాయి మురళీధర్‌రెడ్డి మెమోరియల్‌ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.   కార్యక్రమంలో సీనియర్‌ యూనిట్‌ ఆఫీసర్‌ అయూబ్‌ ఖాన్‌, ఏఎన్‌ఎంలు సామ్రాజ్య లక్ష్మి, సత్యమ్మ, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.  

పెద్దమందడిలో..

పెద్దమందడి : ప్రతీ ఒక్కరు తమ ఇంటి పరిసరా లను పరిశుభ్రంగా ఉంచుకుంటే 90 శాతం రోగాల ను నివారించవచ్చునని వైద్యాధికారి ఇస్మాయిల్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో డెంగీ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.  కార్యక్ర మంలో సర్పంచు వెంకటస్వామి, సూపర్‌వైజర్‌ ఓంప్రకాష్‌, శ్రీనివాస్‌, సునీత, బషీర్‌, వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-17T04:38:30+05:30 IST