27న మేడ్చల్‌లో రెడ్ల సత్తా చాటుదాం

ABN , First Publish Date - 2022-05-23T04:41:42+05:30 IST

గత 2018 ఎన్నికల్లో హామీఇచ్చిన విధంగా చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉన్నదని రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అన్నారు.

27న మేడ్చల్‌లో రెడ్ల సత్తా చాటుదాం
రెడ్డి జేఏసీ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సత్యనారాయణరెడ్డి

రెడ్డి జేఏసీ జాతీయ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి

సిద్దిపేట అగ్రికల్చర్‌, మే 22: గత 2018 ఎన్నికల్లో హామీఇచ్చిన విధంగా చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక నిధులతో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉన్నదని రెడ్డి సంఘాల జేఏసీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి అన్నారు. 27న హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో తలపెట్టిన రెడ్ల మహా సంగ్రామం కార్యక్రమం పోస్టర్‌ను ఆదివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో సంఘం జేఏసీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. అప్పర్‌ క్యాస్ట్‌ అయిన రెడ్డిలలో ఇప్పటికీ పూటగడవని పేదలు ఎంతోమంది ఉన్నారని, రెడ్డి సామాజికవర్గంలోని పేదలకు ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయడంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న రెడ్డి కులస్తులకు కొంత మేలు జరుగుతుందని తెలిపారు. రెడ్డిల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో 27న హైదరాబాద్‌లో రెడ్ల మహా సంగ్రామం సభ నిర్వహించ తలపెట్టామని తెలిపారు. రెడ్డి కులస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివా్‌సరెడ్డి, రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర సహ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-23T04:41:42+05:30 IST