‘సంక్షేమ బోర్డును కాపాడుకుందాం’
ABN , First Publish Date - 2022-10-18T06:26:12+05:30 IST
సంక్షేమ బోర్డును కాపాడుకుం దామని సీఐటీయూ నగర కార్యదర్శి అంజిబాబు అన్నారు.
కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 17: సంక్షేమ బోర్డును కాపాడుకుం దామని సీఐటీయూ నగర కార్యదర్శి అంజిబాబు అన్నారు. సోమవారం కేకే భవన్లో భవన నిర్మాణ కార్మిక సంఘం న్యూసిటీ రెండో మహాసభ జరిగింది. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల కార్మికులకు తీరని నష్టం జరు గుతుందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి దొంగ జీవోలు సృష్టించి కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అనంతరం నగర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు టి.రాముడు, అధ్యక్ష, కార్యదర్శులు కే.సుధా కరప్ప, ఆర్.నరసింహులు, సహాయ కార్యదర్శులు జి.ఏసు, రహిమాన్, దావీదు, ఉపాధ్యక్షులు శంకర్దేవదాసు, మహబూబ్ బాషా, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.