విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుందాం

ABN , First Publish Date - 2021-03-04T05:18:40+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుందామని ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుందాం
విజయనగరం : బైక్‌ ర్యాలీలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు

సీతానగరం, మార్చి 3 : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుందామని ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని బుధవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్లాంట్‌ నిర్వహణకు సొంత నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పోరాట వేదిక నాయకులు రెడ్డి ఈశ్వరరావు, లక్ష్మణనాయుడు, వెంకటరమణ, సీహెచ్‌ కృష్ణ, ఆర్‌.రాము, పి.చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.


జిల్లా కేంద్రంలో బైక్‌ ర్యాలీ

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంధ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కేంద్రంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ, ఐటీయూసీ, ఐఎఫ్‌టీయూ, యూటీఎఫ్‌, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. కోట జంక్షన్‌ నుంచి ఎంజీ రోడ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, మయూరీ కూడలి, రంజని థియేటర్‌ మీదుగా ఈ ర్యాలీ సాగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం తీవ్రతరం అయిందని, ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ ప్రతినిఽధులు అప్పలసూరి, టీవీ రమణ, ఐటీయూసీ నాయకులు కృష్ణంరాజు, ఐఎఫ్‌టీయూ నాయకులు మళ్లిక్‌,  యూటీఎఫ్‌ ప్రతినిధి కె.శేషగిరి, మెడికల్‌ రిప్రజెంటేషన్‌ నాయకులు ఎస్‌ఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


బంద్‌ విజయవంతం చేయండి 

విజయనగరం (ఆంధ్రజ్యోతి) : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా పోరాడిల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఏఐవైఎఫ్‌ (అఖిల భారత యువజన సమైఖ్య) జిల్లా ప్రధాన కార్యదర్శి జీవన్‌ అన్నారు. బుధవారం స్థానిక కోట జంక్షన్‌ వద్ద ఈ నెల 5వ తేదిన నిర్వహించనున్న రాష్ట్రబంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  జీవన్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు తెలుగు ప్రజల పోరాటాలు, ఉద్యమాలు, ఆత్మ బలిదానాలతో నిర్మితమైనదని, అటువంటి ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్రం వెనుకకు తగ్గకపోతే మరో ఉద్యమం తప్పదన్నారు. బుగత అశోక్‌ మాట్లాడుతూ ప్రజల ఆత్మగౌరవం, సెంటిమెంట్‌ను పణంగా పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు రెడ్‌ కార్పొరేట్‌ పరుస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఏఐవై ఎఫ్‌ ప్రతినిధులు వెలగాడ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

రామభద్రపురం : కార్మిక వ్యతిరేక విధా నాలను కేంద్రప్రభుత్వం ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతా మని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు హెచ్చరించారు. బంద్‌పై బుధవారం గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయ న విలేఖర్లతో మాట్లాడుతూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవ హరిస్తున్న ప్రధాని మోదీ చర్యలు దేశానికి ప్రమాదకరమని ఆరోపించారు. రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను విస్మరించడమే కాకుండా ఉన్న పరిశ్రమలను కూడా ప్రైవేటీకరించడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యతతో ఉక్కు పరిశ్రమను పరిరక్షించు కుందామన్నారు. సమావేశంలో సీఐటీయూ మండల నాయకుడు బలస శ్రీను, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. 

బెలగాం : కేంద్ర ప్రభుత్వ విధానా లకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించనున్న రాష్ట్ర బంద్‌కు సహకరించాలని రైతుకూలీ సంఘం నాయకులు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీ, రైల్వే, బ్యాంకింగ్‌, ఇలా తొమ్మిది జాతి నవరత్నాలుగా పిలిచే సంస్థలను ప్రైవేటీకరణ నిర్ణయం తగదన్నారు. 


Updated Date - 2021-03-04T05:18:40+05:30 IST