దీన్‌ దయాళ్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం

ABN , First Publish Date - 2022-09-26T04:37:44+05:30 IST

దీన్‌ దయాళ్‌ ఉపా ధ్యాయుడి స్ఫూర్తితో ముందుకు సాగుదామని బీజేపీ రాష్ట్ర నాయకుడు డోకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు.

దీన్‌ దయాళ్‌ స్ఫూర్తితో ముందుకు సాగుదాం
కొత్తకోటలో దీన్‌ దయాళ్‌ జయంతి సందర్భంగా మొక్కలు నాటి నీళ్లు పోస్తున్న నాయకులు

కొత్తకోట, సెప్టెంబరు 25 : దీన్‌ దయాళ్‌ ఉపా ధ్యాయుడి స్ఫూర్తితో ముందుకు సాగుదామని బీజేపీ రాష్ట్ర నాయకుడు డోకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి పేర్కొ న్నారు. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెవడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయ కుడు డోకూర్‌ పవన్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆది వారం దీన్‌ దయాళ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌరస్తాలో దీన్‌ దయాళ్‌ చిత్ర పటా నికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంత రం బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పవన్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ హిందుధర్మ పరిరక్షణకు దీన్‌ దయాళ్‌ కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలను సాధించడా నికి గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేద్దామని వివ రించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నారాయణమ్మ, భరత్‌ భూషణ్‌, నవీన్‌రెడ్డి నాయకులు వెంకట్‌రెడ్డి, దాబ శ్రీనివాస్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, వనపర్తి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మన్నెం యాదవ్‌, రాఘవేందర్‌ రెడ్డి, నరసింహ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో...

ఆత్మకూర్‌ :పండిత్‌ దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఆత్మకూర్‌ పట్టణ కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జలందర్‌రెడ్డి హాజరై దీన్‌దయాళ్‌ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ అశోక్‌ కుమార్‌, జిల్లా నాయకులు నాగేం దర్‌, గంగాధర్‌, పట్టణ అధ్యక్షులు విజయ్‌ కుమార్‌, శివశంకర్‌, శేషు, రఘు, హరీష్‌, రవితో పాటు ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.  

అమరచింతలో...

అమరచింత : దీన్‌దయాళ్‌ జయంతిని ఆదివారం అమరచింతలో బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని బీజేపీ జెండా కట్ట దగ్గర దీన్‌ దయాళ్‌ చిత్రపటానికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏకాత్మ మనవాదం ప్రతిపాదించిన  గొప్ప వ్యక్తి అని ఆయన సేవలు కొనియాడారు.  కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు మేర్వ రాజు, నాయకులు అశోక్‌ కుమార్‌, నరాల సిద్దు, మంగ అనిల్‌, నర్సింలు గౌడ్‌, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. 


 



Updated Date - 2022-09-26T04:37:44+05:30 IST