విభేదాలు వీడి.. ఐక్యతతో పనిచేయండి

ABN , First Publish Date - 2022-08-10T05:24:20+05:30 IST

తెలుగుదేశం పార్టీకి మండలం కంచుకోట ్ఞఅని, స్థానిక నాయకులు, కార్యకర్తలు చిన్నచిన్న విభేధాలు విడనాడి సమష్టిగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పనిచేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు.

విభేదాలు వీడి.. ఐక్యతతో పనిచేయండి
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

టీడీపీ మండల సమావేశంలో మాజీ మంత్రి పల్లె

అమడగూరు, ఆగస్టు 9:  తెలుగుదేశం పార్టీకి మండలం కంచుకోట ్ఞఅని, స్థానిక నాయకులు, కార్యకర్తలు చిన్నచిన్న విభేధాలు విడనాడి సమష్టిగా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పనిచేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని చౌడేశ్వరీ దేవి కల్యాణమండపంలో మంగళవారం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలో నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా సభ్యత్వాల నమోదులో చాల వెనుకబడిందన్నారు. సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలన్నారు. అలాగే బూత కన్వీనర్ల ఎంపిక కీలకమన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు అనుగుణంగా ప్రజలకు అండగా ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించడానికి చొరవ చూపితే ప్రజలు పార్టీ వెంటే ఉంటారన్నారు. సభ్యత్వం తీసుకుంటే రూ. 2లక్షలు ఇన్సూరెన్స వర్తిస్తుందన్నారు. వైసీపీ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ప్రతి కార్యకర్త కనీసం పది మందికి వైసీపీ పథకాల లోపాలు తెలపాలన్నారు. అలాగే 18 యేళ్లు నిం డినవారు  ఓటరుగా  నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్ర మంలో టీ డీపీ మండల కన్వీనర్‌ గోపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస రెడ్డి,  నా యకులు క్రిష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, కమ్మల భాస్కర్‌, రవికుమార్‌, రెడ్డెప్ప, హనుమంతరెడ్డి, తుమ్మిలరెడ్డి, క్రిష్టప్ప, తిరుపాల్‌, సిద్దూ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మండలంలోని కొలిమిరాళ్ల పల్లి వద్ద నూతనంగా నిర్మించిన అక్కదేవతల గుడికి ఆర్థికసాయం అందించారు. 


Updated Date - 2022-08-10T05:24:20+05:30 IST