చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం

ABN , First Publish Date - 2022-08-08T05:38:43+05:30 IST

చేనేత వస్ర్తాలు ధరించి నేత కార్మికులను ప్రోత్సహిద్దామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ తెలిపారు.

చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌

 

సంగారెడ్డిరూరల్‌, ఆగస్టు 7: చేనేత వస్ర్తాలు ధరించి నేత కార్మికులను ప్రోత్సహిద్దామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శరత్‌ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని ప్రభుత్వ ఐటీఐ వద్ద ఆదివారం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఐటీఐ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చేనేత వస్త్రాలు ధరించడం వల్ల నేత కార్మికులకు ఉపాఽధి అందించినవారమవుతామని అన్నారు. నెలలో రెండు రోజుల పాటు చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ధరించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో చేనేత కార్మికులను అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మిస్‌ ఇండియా సుహాసిని పండ్యాల, జోగిపేట చేనేత సహాకార సంఘం అధ్యక్షుడు వర్కల అశోక్‌, కార్యదర్శి మాణయ్య, ఉన్ని సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి నారాయణ, హ్యాండ్లూమ్‌ జిల్లా అధికారి విజయలక్ష్మి, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

 ఆయుష్‌ వైద్యసేవలపై చైతన్యం కల్పించాలి

సంగారెడ్డిఅర్బన్‌:  ఆయుష్‌ వైద్యసేవలపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని కలెక్టర్‌ శరత్‌ సూచించారు. సంగారెడ్డిలోని కలెక్టరేట్‌లో ఆయుర్వేద, హోమియోపతి, యునానీ, యోగా వైద్య విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేసే కరపత్రాలను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయూష్‌ వైద్యసేవల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆయుర్వేద విధానం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించే విషయాలను తెలియజేయాల న్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, జిల్లా ఎస్పీ రమణకుమార్‌, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రిదేవి, హోమియోపతి సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ నర్మద షిండే, ఆయుర్వేద సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ శ్యాంసుందర్‌ప్రసాద్‌, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:38:43+05:30 IST