Advertisement
Advertisement
Abn logo
Advertisement

తక్కువ క్యాలరీల కోసం!

వేసవిలో మ్యాంగో మిల్క్‌ షేక్‌, బనానా మిల్క్‌ షేక్‌ లు నోరూరిస్తుంటాయి. ఈ రెండిటిలో ఆరోగ్యకరమైన పోషకాలు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. అయితే వీటిలో బరువు తగ్గాలనుకునే వారికి ఏది మంచిదంటే...


పోషకాలు, బరువు తగ్గడం పరంగా చూస్తే మ్యాంగో మిల్క్‌ షేక్‌ కన్నా బనానా మిల్క్‌ షేక్‌ ఉత్తమమైనది. క్యాలరీల లెక్కన చూసినా కూడా బరువు తగ్గాలనుకునే వారికి బనానా మిల్క్‌ షేక్‌ మంచి ఛాయిస్‌. ఒక గ్లాసు చక్కెర కలపని మ్యాంగో మిల్క్‌ షేక్‌  తాగితే 170 క్యాలరీలు అందుతాయి. అదే బనానా షేక్‌ తాగితే 150 క్యాలరీలు లభిస్తాయి. బరువు తగ్గాలంటే క్యాలరీలు తక్కువ అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అందుకే వర్కవుట్స్‌ తరువాత బనానా షేక్‌ తాగితే ఫలితం ఉంటుంది. 


బనానా మిల్క్‌ షేక్

ఇంటివద్దనే తయారుచేసుకోవాలి. మీగడ లేని పాలను మాత్రమే వాడాలి. చక్కెర బదులు తేనె, బెల్లం లేదా మ్యాపిల్‌ సిరప్‌ కలపాలి. నట్స్‌ను ముక్కలను చల్లుకొని తాగాలి.

Advertisement
Advertisement