Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలిపిరి వద్ద చిరుత కలకలం

తిరుమల, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం అలిపిరి వద్ద శుక్రవారం చిరుత కలకలం సృష్టించింది. మొదటి ఘాట్‌రోడ్డుకు పక్కనున్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వెనుకభాగంలోని గార్డెన్‌లోకి రాత్రి ఓ చిరుత రావడాన్ని అక్కడి భక్తులు, సిబ్బంది గమనించారు. వెంటనే విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో సైరన్‌తో వాహనాలు రాగా అప్పటికే చిరుత అడవిలోకి వెళ్లిపోయినట్టు గుర్తించారు. అక్కడివారిని అప్రమత్తం చేయడంతో పాటు భద్రతను ఏర్పాటు చేశారు. చిరుత దట్టమైన అడవిలోకి వెళ్లిపోయేలా శబ్ధాలు చేశారు. 

Advertisement
Advertisement