Viral Video : అర్ధరాత్రి గేటు దూకి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. ఇది చూసిన పెంపుడు కుక్క ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-27T10:41:53+05:30 IST

ఒళ్లు గగ్గురుపొడిచే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అర్ధరాత్రి వేళ ఒక ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్క ఏదో అలికిడిని గ్రహిస్తుంది. వెంటనే లేచి ఇంటి గేటు వద్దకు వెళ్లి అక్కడ ఏదో జంతువుని చూసి గట్టిగా మొరుగుతుంది. ఆ జంతువు దెగ్గరకు రావడం చూసి ఇంటి వాకిలి వైపుకి ...

Viral Video : అర్ధరాత్రి గేటు దూకి ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. ఇది చూసిన పెంపుడు కుక్క ఏం చేసిందంటే..

ఒళ్లు గగ్గురుపొడిచే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో అర్ధరాత్రి వేళ ఒక ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు కుక్క ఏదో అలికిడిని గ్రహిస్తుంది. వెంటనే లేచి ఇంటి గేటు వద్దకు వెళ్లి అక్కడ ఏదో జంతువుని చూసి గట్టిగా మొరుగుతుంది. ఆ జంతువు దెగ్గరకు రావడం చూసి ఇంటి వాకిలి వైపుకి పరుగులు తీస్తుంది. 


ఇంతలో ఆ జంతువు ఎత్తుగా ఉన్న ఇంటి గేటు మీదకు దూకుడుగా ఎక్కుతుంది. అది ఒక పెద్ద చిరుత పులి. ఆ చిరుత ఇంటి ఆవరణలోకి గేటు మీద నుంచి కిందికి దూకి వెళుతుంది. కొద్ది సేపు కుక్క, చిరుత పులి అరుపులు వినిపిస్తాయి. ఆ తరువాత చిరుతపులి మళ్లీ గేటు దగ్గరకు వస్తుంది. కానీ ఈ సారి ఒంటరిగా కాదు.. కుక్కను నోట కరుచుకొని. వెంటనే గేటు పక్కన ఉన్న గోడ మీదికి ఒక్కసారిగా చిరుత ఎగిరి చేరుకుంటుంది. ఆ తరువాత గోడ మీద నుంచి బయటికి దూకి వెళ్లిపోతుంది.

ఈ దృశ్యాలన్నీ ఆ ఇంటి ఆవరణలోని సిసిటీవిలో రికార్డయ్యాయి. ఆ సీసీటీవి వీడియోని ఒక ఐఎఫ్‌యస్ ఆఫీసర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోని 16,000 పైగా వ్యూస్ ఉన్నాయి. చూసిన వారంతా షాక్ అయ్యామని కామెంట్లు పెడుతున్నారు. 

కొండ ప్రాంతాల్లో చిరుత పులులు కుక్కలను వేటాడుతుంటాయి. అక్కడ నివసించే వారి పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు ఇలా పులుల చేత వేటాడబడుతున్న సంఘటనలు ఇటీవల బాగా పెరిగాయి.

వీడియో పోస్ట్ చేసిన ఐఎఫ్‌యస్ ఆఫీసర్ కుక్కల మెడ చుట్టూ ఇనుప కాలర్ అమర్చాలని.. దానివల్ల కుక్కలు పులుల బారిన పడకుండా కాపాడు కోవచ్చునని సూచించారు.



Updated Date - 2021-12-27T10:41:53+05:30 IST