వామపక్షాల ధర్నా

ABN , First Publish Date - 2021-10-29T05:19:14+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరం శ్యామల సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

వామపక్షాల ధర్నా

 రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 28: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరం శ్యామల సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సీపీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నేత ఏవీ రమణ మాట్లాడారు. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు పెట్రోల్‌ ధర రూ.74కు పెరిగిందని ఆందోళన చేశారని, ఇప్పుడు దేశ ప్రధాని అయ్యాక ప్రస్తుతం రూ.113 దాటిందని విమర్శించారు.  వంట గ్యాస్‌ ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు.  ప్రజలు అధిక ధరలు చెల్లిస్తుంటే వ్యాక్సినేషన్‌ ఉచితం ఎలా అవుతుందని ప్రశ్నించారు.  సీపీఎం నాయకులు ఎస్‌ఎస్‌ మూర్తి, టీఎస్‌ ప్రకాష్‌, పి.వెంకటేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నల్లా రామారావు, యడ్ల లక్ష్మి, నల్లా భ్రమరాంబ, కె.జోజి, పి.తులసి, సుబ్రహ్మణ్యం, పవన్‌, లోవరాజు, కిరణ్‌, పూర్ణిమరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:19:14+05:30 IST