Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రియాంకను పరామర్శించిన నేతలు

అనంతపురం వైద్యం, నవంబరు26: పోలీసులు, వైసీపీ శ్రేణుల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు యత్నించి, జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలుగ మహిళ అనంత పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వాల్మీకి ప్రియాంకను పయ్యావుల కేశవ్‌, టీడీపీ కళ్యాణదుర్గం ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు, రాష్ట్ర కార్యదర్శులు ఆలం నరసానాయుడు, త లారి ఆదినారాయణ, బుగ్గయ్య చౌదరి, దేవళ్ల మురళి, మాజీ మే యర్‌ మదమంచి స్వరూప, మాజీ డిప్యూటీ మేయర్‌ సాకే గంపన్న, నాయకులు సరిపూటి రమణ, వెంకటేష్‌ గౌడ్‌, దొడగట్ట నారాయణ, తెలుగు మహిళలు సరళ, రమాదేవి, నాయుడమ్మ, మహేశ్వరి తదితరులు శుక్రవారం పరామర్శించారు. 

శింగనమల : ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న వాల్మీకి ప్రియాం కను శుక్రవారం అనంతపు రం పార్లమెంటు అధికార ప్రతినిధి డేగల కృష్ణమూర్తి తదితరులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఎనఎస్‌ఎఫ్‌ నాయకులు లక్ష్మీనరసింహ, సుధాకర్‌ ఉన్నారు. 


Advertisement
Advertisement