చాణక్య నీతి: ధనలక్ష్మి అనుగ్రహం కావాలంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

ABN , First Publish Date - 2022-05-28T11:56:35+05:30 IST

చాణక్య నీతి ప్రకారం ధనవంతులు కావాలనే కోరిక ...

చాణక్య నీతి: ధనలక్ష్మి అనుగ్రహం కావాలంటే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి!

చాణక్య నీతి ప్రకారం ధనవంతులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మనిషి ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కలియుగంలో ధనం ప్రధాన వనరుగా మారిపోయింది. ఆచార్య చాణక్యుని ప్రకారం, సంపదకు దేవత లక్ష్మి. ఈ అమ్మవారి అనుగ్రహం లభించినప్పుడే జీవితంలో ఐశ్వర్యం లభిస్తుంది. చాణక్యనీతి ప్రకారం ధనలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ 5 పనులు ఎప్పుడూ చేయకూడదు. ఈ పనులు చేస్తే అమ్మవారు అక్కడ నిలిచివుండదు. 

అపరిశుభ్రత:

చాణక్య విధానం ప్రకారం, లక్ష్మిదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం. శుభ్రత పాటించని ప్రదేశానికి లక్ష్మిదేవి ఎప్పుడూ వెళ్లదు. ఆరోగ్యానికి పరిశుభ్రత అనేది తప్పనిసరి. ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రతా నియమాలను పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తన ప్రతి పనిని సులభంగా పూర్తి చేయగలడు. అలాంటి వ్యక్తులు ఉత్సాహంగా ఉంటారు.



డబ్బు వృథా:

డబ్బును ఎప్పుడూ వృథా చేయకూడదని చాణక్య నీతి చెబుతుంది. అనవసరంగా డబ్బు ఖర్చు చేసేవారి దగ్గర లక్ష్మిదేవి నిలిచివుండదు. 

దుస్సాగత్యం 

మీకు లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే మంచివారితో స్నేహం(సత్సాంగత్యం)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అని చాణక్య విధానం చెబుతోంది. దుష్టులతో సహవాసం మనిషి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే దుస్సాంగత్యాన్ని వెంటనే వదిలివేయాలి.

అత్యాశ

చాణక్యుని విధానం ప్రకారం డబ్బుపై అత్యాశ కలిగినవారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎప్పటికీ పొందలేరు. మరోవైపు కష్టపడి పనిచేసేవారిని, నియమాలు, క్రమశిక్షణను అనుసరించే వారిని, లక్ష్మీదేవి ఎప్పుడూ నిరాశపరచదు.

అహంకారం

అహంకారం ఉన్నవారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. వినయం, మధురమైన మాటలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి. అలాంటి వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక దీవెనలు అందజేస్తుంది. అహంకారంతో జీవించే వారు తరువాత ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి వారికి సమాజంలో గౌరవం లభించదు. 

Updated Date - 2022-05-28T11:56:35+05:30 IST