‘నాకు పింఛనొద్దు’

ABN , First Publish Date - 2022-05-17T06:59:49+05:30 IST

రాజమహేంద్రవరం సిటీ, మే 16: నాకు పింఛను ఇప్పించండి, రేషన్‌ కార్డు ఇప్పించండి అంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారిని చూశాంగాని.. రేషన్‌కార్డులో తన పేరు, ప్రభుత్వ పింఛను తొలగించి అర్హుడికి ఇవ్వండి అంటూ తిరిగే వ్యక్తిని చూడటం అరుదు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో ఇలాంటి అనుభవమొకటి ఎదు రైంది. జిల్లా పరిధిలోని నిడదవోలు మండలం పశివేదల గ్రామానికి చెం దిన

‘నాకు పింఛనొద్దు’
జేసీ శ్రీధర్‌కు వినతిపత్రం అందిస్తున్న కొడవలి వెంకట బాలాజీ

మూడేళ్లుగా తనకు (డిజేబులిటి) పింఛను                     

తీసివేయమంటూ కోరుతున్న హైకోర్టు న్యాయవాది

స్పందనలోనూ పలుమార్లు అర్జీలు 

పట్టించుకోని అధికార యంత్రాంగం 

రాజమహేంద్రవరం సిటీ, మే 16: నాకు పింఛను ఇప్పించండి, రేషన్‌ కార్డు ఇప్పించండి అంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే వారిని చూశాంగాని.. రేషన్‌కార్డులో తన పేరు, ప్రభుత్వ పింఛను తొలగించి అర్హుడికి ఇవ్వండి అంటూ తిరిగే వ్యక్తిని చూడటం అరుదు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందనలో ఇలాంటి అనుభవమొకటి ఎదు రైంది. జిల్లా పరిధిలోని నిడదవోలు మండలం పశివేదల గ్రామానికి చెం దిన కొడవలి వెంకట బాలాజీ  రైతు కుటుంబానికి చెందినప్పటికీ అతను ఉన్నత చదువులు చదువుకుని అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్నారు. వెంకట బాలాజీ స్వగ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అతనికి దివ్యాంగ పింఛ ను కేటాయించింది. అలాగే రేషన్‌కార్డు కూడా ఇచ్చారు. అయితే రేషన్‌ కార్డు మాత్రం అతని తల్లిదండ్రులతో కలిసి ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో అడ్వకేట్‌గా పదేళ్లగా పనిచేస్తున్న తనకు ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నందున తనకు ప్రభుత్వం ఇచ్చే పింఛను వేరొక అర్హుడికి అందించాల ని ప్రభుత్వ అధికారులను కోరుతూ గత మూడేళ్లుగా గ్రామస్థాయి మొద లుకొని జిల్లాస్థాయి వరకు ప్రభుత్వ అధికారులకు వినతులు అందించా రు. అలాగే స్పందనలో పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఇంత వరకు అధికారులు అతని పింఛను రద్దు చేయలేదు. ఒకరకంగా చెప్పాలంటే బాలాజీ తన పింఛను రద్దు కోసం మూడేళ్లుగా ఒక పోరాటమే చేస్తున్నారు. గతంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌లో అధికారులకు విన్నవించగా, నూతన జిల్లాల విభజన తర్వాత అప్పుడే రెండు సార్లు జిల్లా కలెక్టరేట్‌లో మొరపెట్టుకున్నారు. నా పింఛను తొలగించండి, వేరొక అర్హుడికి ఇవ్వండి అంటూ గగ్గోలు పెట్టినా అధికారులు పెడచెవిన పెట్టడం విడ్డూరంగా ఉంది. సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన వెంకట బాలాజీ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ తనకు పింఛను అవసరం లేదని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు వినడం లేదని చెప్పారు. పెన్షన్‌ తీసివేయాలంటే ముందు రేషన్‌ కార్డులో పేరు తొలగించాలని కూడా అధికారులను కోరడం జరిగిందన్నారు. ఎంతోమంది పేదలున్నారని అందులో అర్హు లకు తన పించను కేటాయిస్తే బాగుంటుందన్నారు. ఇప్పటికైనా రేషన్‌ కార్డులో, పింఛన్లు జాబితాలో తన పేరును తొలగించాలని కోరారు.

Updated Date - 2022-05-17T06:59:49+05:30 IST