మాట మారే!

ABN , First Publish Date - 2020-06-03T10:55:29+05:30 IST

గతేడాది మం జూరై అంతగా పురోగతి లేని సీసీరోడ్ల పనులు కొనసాగింపు విషయంలో ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వు లను ప్రభుత్వం సవరించింది.

మాట మారే!

ఒక్కశాతం జరిగినా ఒకే..

ప్రారంభం కాని పనులు మాత్రమే రద్దు

గతేడాది సీసీరోడ్లపై తాజా ఉత్తర్వులు

త్వరితగతిన పూర్తికి ఎమ్మెల్యేలకు లేఖలు


ఒంగోలు,జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): గతేడాది మం జూరై అంతగా పురోగతి లేని సీసీరోడ్ల పనులు కొనసాగింపు విషయంలో ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వు లను ప్రభుత్వం సవరించింది. మరికొన్ని పనులు కొనసాగించేందుకు వీలుగా తా జాగా అవకాశం కల్పించింది. ఒక్కశాతం పని జరిగిఉన్నా ఆ పనులు కొనసా గిం చుకొనే వెసులుబాటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.582 కోట్ల విలువైన 7,402 పనులను కొనసాగిం చేదుకు తాజా ఉత్తర్వుల వల్ల అవకాశం కలుగనుంది. 


జిల్లాలో గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల ద్వారా గ్రా మాల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో అధికంగా సి మెంట్‌ రోడ్లు ఉంటున్నాయి. ప్రత్యేకించి జిల్లాలో 2016-17 నుంచి 2018-19 మధ్య కాలంలో భారీగా జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019-20 లో పనులు మంజూరులో తొలుత కొంతజాప్యం జరిగినా తర్వాత రూ.540 కోట్ల విలువైన పనులు మంజూరు చేశారు.


అయితే, మంజూరులో ఆలస్యం, అధికారు ల వైపు నుంచి పనుల పురోగతిపై అంతగా వత్తిడి లేకపోవడం, అంతకుముందు చేసిన పనుల బిల్లుల చెల్లింపులో జాప్యం ఇలా పలు కారణాలతో ఆ పనులు ముందుకు సాగలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా సీసీరోడ్ల పనులను ఇవ్వకుండా ఆపేయడమేకాక గతేడాది మంజూరైన వాటిలోనూ 25శాతంపైన జరిగిన  వాటిని మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దానివల్ల జిల్లాలో రూ.400కోట్ల విలువైన పనులు రద్ద య్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి ఈ విష యాన్ని తీసుకెళ్లి పనులు కొనసాగింపు కోరారు. 


ఈ నేపథ్యంలో కొన్ని సడలింపులను ఇచ్చారు. తాజా ఉత్తర్వుల ప్రకారం గతే డాది మంజూరై ఇటీవల నిలిపేసిన సీసీరోడ్లు పనుల్లో అసలు ప్రారంభం కానివి మాత్రమే రద్దవుతున్నాయి. ఒక్కశాతం పనిచేసినట్లు రికార్డుల్లో నమోదైనా వాటిని కొనసాగించాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటివరకు 25శాతంకు పైగా పని జరిగిన వాటికి మాత్రమే అవకాశం ఉండగా తాజా ఆదేశాలతో 1 నుంచి 25 శా తం జరిగిన వాటికి కూడా అవకాశం లభించింది. అలాంటివి జిల్లాలో రూ.200 కోట్ల విలువైన పనులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పనులు కొనసాగింపునకు సంబం ధించి ఇచ్చిన తాజా ఉత్తర్వులను ఎమ్మెల్యేలకు తక్షణమే తెలిసేలా పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి పి.రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా వారికి లేఖలు రాశారు. డ్వామా అధికారుల ద్వారా వాటిని వారికి మంగళవారం అందజేసినట్లు అధికారవర్గాల సమాచారం. కాగా గతేడాది పనులకు మరికొంత వెసులుబాటును కల్పించిన ప్ర భుత్వం ఈఏడాది కొత్తగా సీసీరోడ్ల పనులు మంజూరును మాత్రం నిలిపివేసింది. 

Updated Date - 2020-06-03T10:55:29+05:30 IST