Heavy rains: అర్థరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

ABN , First Publish Date - 2022-07-26T14:45:14+05:30 IST

భాగ్యనగరాన్ని అర్ధరాత్రి వర్షం ముంచెత్తింది. నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం కురిసింది.

Heavy rains: అర్థరాత్రి హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

హైదరాబాద్: భాగ్యనగరాన్ని అర్ధరాత్రి వర్షం ముంచెత్తింది. నగరవ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం(Heavy rains) కురిసింది. యాకుత్‌పురా, మల్లేపల్లిలో వర్షానికి  వాహనాలు కొట్టుకుపోయాయి. బేగంబజార్‌లోని ఇళ్లు, షాపుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. రోడ్లపై మోకాలిలోతు నీటిలో వాహనాలు ఉండిపోయాయి. పలు చోట్ల సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునిగాయి. వరద ప్రవాహంలో పలుచోట్ల  కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్‌ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్‌ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. హయత్‌నగర్‌ 9.2 సెంటీమీటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8  సెంటీమీటర్లు, అంబర్‌పేటలో 8.2  సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0  సెంటీమీటర్లు, బహదూర్‌పూరాలో 7.8  సెంటీమీటర్లు, చార్మినార్‌లో 7.5  సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 

Updated Date - 2022-07-26T14:45:14+05:30 IST