వైభవంగా కుళ్లాయిస్వామి చివరి దర్శనం

ABN , First Publish Date - 2022-08-12T05:48:26+05:30 IST

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కుళ్లాయిస్వామి చివరి దర్శనం వైభవంగా జరిగింది. కుళ్లాయిస్వామి చివరి దర్శనం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేశారు.

వైభవంగా కుళ్లాయిస్వామి చివరి దర్శనం
కుళ్లాయిస్వామి చివరి దర్శనం..

 ముగిసిన గూగూడు బ్రహ్మోత్సవాలు

నార్పల, ఆగస్టు 11: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కుళ్లాయిస్వామి చివరి దర్శనం  వైభవంగా జరిగింది. కుళ్లాయిస్వామి చివరి దర్శనం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేశారు. కుళ్లాయిస్వామి పీరును ఆలయం బయటి నుంచి భక్తులకు చూపించారు. అనంతరం కుళ్లాయిస్వామి పీర్లను మకానంలోని ఒక పెట్టెలో భద్రపరిచారు.  వచ్చే బ్రహ్మోత్సవాల్లో కుళ్లాయిస్వామి పీరును బయటికి తీస్తామని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. గూగూడు కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ఇంతటితో ముగిశాయని దేవదాయశాఖ అధికారి శోభ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన రాజన్న, గ్రామపెద్దలు రాజన్న, జాఫర్‌వలి, పూజారి నరసింహులు, కుళ్లాయప్ప, హాజీరాబి, ఆలయ పూజారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:48:26+05:30 IST