వ్యవసాయ రంగానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-07-31T04:33:26+05:30 IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి, రైతు ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని జడ్పీ చైర్‌ప ర్సన్‌ సరిత అన్నారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట
కేటీదొడ్డి రైతు వేదిక భవనంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత 

- రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- కేటీదొడ్డిలో రైతువేదిక భవనం ప్రారంభం, రేషన్‌ కార్డులు పంపిణీ

కేటీదొడ్డి, జూలై 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి,  రైతు ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. శుక్రవారం ఎంపీపీ మనోరమ్మ అధ్యక్షతన మండల కేంద్రంలోని రైతు వేదిక భవ నం ప్రారంభం, రేషన్‌ కార్డులు, కల్యాణలక్ష్మి  చెక్కు ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ముఖ్య అతిథులుగా జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, ప్రతీ ఒక కు టుంబం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధిపొందుతుందని తెలిపారు. రైతు శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ రంగా న్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్య మంత్రి కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. అందు లో భాగంగానే రైతుల కోసం రైతు వేదిక భవనా లను నిర్మించి రైతులకు మరిన్ని సేవలం దిస్తున్నా రన్నా రు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు రాజ శేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, ఇన్‌చార్జ్‌ తహసీ ల్దార్‌ సుభాష్‌నాయుడు, రెవెన్యూ సిబ్బంది, వ్యవసా యశాఖ అధికారి కరుణశ్రీ, ఏఈవో ప్రీతి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హ న్మంతు, సర్పంచు పావని, ఆయా గ్రామాల సర్పం చులు, ఎంపీటీసీలు, రేషన్‌ డీలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.    

 పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

మల్దకల్‌: పేదలకు తెలంగాణ ప్రభుత్వం అం డగా ఉంటుందని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. శుక్రవారం మల్దకల్‌ మండల కేంద్రంలో కొత్త రేషన్‌ కార్డులను, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి జడ్పీ చైర్‌పర్సన్‌ హాజరయ్యా రు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలు ఆకలితో ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసి ప్రతీ ఒక్కరికీ 6 కిలోల బియ్యం అందజేస్తున్నారని తెలిపారు. ఎమ్మె ల్యే మాట్లాడుతూ గద్వాల నియోజకవర్గానికి 1224 కొత్త రేషన్‌కార్డులు మంజూరు కాగా, మల్దకల్‌ మం డలానికి 197 కార్డులు మంజూరయ్యాయని తెలిపా రు. 113మందిలబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు  పెద్దవీరన్న, స ర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు  వెంకటేశ్వర రెడ్డి, అధికారులు, టీఆర్‌ఎస్‌నాయకులు పాల్గొన్నారు. 

 పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

గద్వాల రూరల్‌: నిరుపేదలలో వెలుగు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మం డల పరిషత్‌ కార్యాలయంలో రేషన్‌కార్డులు, కల్యా ణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల మం డలానికి 199 రేషన్‌కార్డులు మంజూరు అయ్యా యని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆల్వాల్‌ ప్రతాప్‌ గౌడ్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎంఏ సుభాన్‌, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, సర్పం చుల సం ఘం జిల్లా అధ్యక్షుడు మజీద్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, పార్టీ మం డల అధ్యక్షుడు రమేష్‌నాయుడు, లబ్ధిదారులు పాల్గొన్నారు.  

  అన్నివిధాలా అభివృద్ధి 

 ధరూరు: టీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామాలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయని ఎంపీపీ  నజుమున్నిసాబేగం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు  వేదికలో నూతన రేషన్‌ కార్డులను ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘన త  ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు.  కార్యక్రమం లో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, జాకీర్‌, ప్రభాకర్‌గౌడ్‌, సర్పంచ్‌ పద్మమ్మ, ఎంపీటీసీ శివలీల, దౌలన్న, బషీర్‌, రాజు, టీఆర్‌ఎస్‌ జిల్లా సమన్వయకర్త పురుషోత్తమ్‌రెడ్డి, జాంపల్లె భరత్‌సింహారెడ్డి, అంజి, సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T04:33:26+05:30 IST